భారత్ కు G-7 సభ్య దేశాల గుడ్ న్యూస్.. ఇక కోట్లల్లో వ్యాపారం!

G7 Summit: 50 వ G7 శిఖరాగ్ర సమావేశం ఇటలీ దేశంలో  2024 జూన్ 13 నుండి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగాయి. చివరి రోజు కూటమి దేశాలు భారత్ కి గుడ్ న్యూస్ చెప్పాయి.

G7 Summit: 50 వ G7 శిఖరాగ్ర సమావేశం ఇటలీ దేశంలో  2024 జూన్ 13 నుండి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగాయి. చివరి రోజు కూటమి దేశాలు భారత్ కి గుడ్ న్యూస్ చెప్పాయి.

ప్రస్తుతం ఇటలీ వేదికగా జీ7 సభ్య దేశాల సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు సాగిన ఈ కూటమి సదస్సు ముగింపు జరిగింది. ఇక చివరి రోజు జీ7 సభ్య దేసాలు భారత్ కి గుడ్ న్యూస్ చెప్పాయి. ఈ సదస్సు ముగింపు సందర్భంగా కీలక ప్రకటన చేశాయి. ఇండియా- మిడిల్ ఈస్ట్ – యూరోప్ ఎకనమిక్ కారిడార్‌ (ఐఎంఈఈఈసీ)కు మద్దతు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి. గత ఏడాది డిసెంబర్లో ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ఇండియా-యూరప్ ఎకనమిక్ కారిడార్‌కు సంబంధించి కీల ప్రకటన వెలువడింది. ఈ ప్రాజెక్ట్ విషయమై ఇండియా ఇప్పటికే తనవైపు నుంచి పనులు  ప్రారంభించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

50 వ G7 శిఖరాగ్ర సమావేశం  2024 జూన్ 13 నుండి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగాయి. ఇటలీలోని అపులియాలోని ఫాసనో నగరంలో బోర్గో ఎగ్నాజియాలో ఈ సదస్సు జరిగింది. యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో సహా అన్ని G7 సభ్య దేశాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. జీ7 కూటమిలో భారత్ సభ్యదేశం కానప్పటికీ సదస్సులో పాల్గొంది. బ్రెజిల్, అర్జెంటీనా, యూఏఈ, టర్కీ తదితర దేశాలతో పాటు ఇండియాకు కూడా ఈ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ఆహ్వానం పంపించారు.

ఈ నేపథ్యంలోనే జీ7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన మాట కూడా జీ7 కూటమి దేశాలు నిలబడ్డాయి. ఐఎంఈఈఈసీ కారిడార్‌ కు మద్దతు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపాయి. ఈ కారిడార్ తో పాటు పాటు సెంట్రల్ ఆఫ్రికాలోని లొబిటో కారిడార్, లుజాన్ కారిడార్, మిడిల్ కారిడార్లకు సైతం అండగా ఉంటామని జీ7 దేశాలు ప్రకటించాయి. ఐఎంఈఈఈసీ కారిడార్‌లో భాగంగా భారత పశ్చిమ తీరంలోని నౌకాశ్రయాలను యునైటెడ్ అరబ్ దేశాలతో అనుసంధానిస్తారు. అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా ఆఫ్రికాక దేశాలకు తరలిస్తారు. ఈ కారిడార్ కారణంగా భారత వస్తువులకు యూరప్‌లో డిమాండ్ పెరుగుతోంది. అలానే ఈ కారిడార్ వల్ల ఆఫ్రికాతోనూ సంబంధాలు మెరుగుపడుతాయి.

ఈ కారిడార్ కారణంగా భారత్,  మధ్య పశ్చిమ దేశాలు, యూరప్ దేశాల మధ్య బంధం మరింత బలపడుతుంది. చైనా ప్రతిష్టాత్మకంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) కారిడార్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి పోటీగానే భారత్ తో పాటు పలు దేశాలు  ఈ కారిడార్‌ను తెర మీదకు తెచ్చారు. ఎర్ర సముద్రం మీదుగా సరకు రవాణాకు హౌతీ రెబల్స్ నుంచి ఆటంకాలు ఎదురవుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా-యూరప్ ఎకనమిక్ కారిడార్  మంచి ప్రత్యామ్నాయం అని పలువురు నిపుణులు అభిప్రాయా పడుతున్నారు. మొత్తానికి ఈ జీ7 కూటమి దేశాలు ఐఎంఈఈఈసీ కారిడార్‌ కి మద్దతు ఇవ్వడం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Show comments