వైరల్‌ వీడియో: ఇదే కదా అసలైన స్నేహం!

కష్టనష్టాల్లో తోడుండేవారే నిజమైన స్నేహితులని అంటూ ఉంటారు. కష్టనష్టాల్లోనే కాదు.. ప్రాణాలు పోయే పరిస్థితుల్లో యముడితో గొడవపడి మనల్ని కాపాడే వారే ప్రాణ స్నేహితులు..

కష్టనష్టాల్లో తోడుండేవారే నిజమైన స్నేహితులని అంటూ ఉంటారు. కష్టనష్టాల్లోనే కాదు.. ప్రాణాలు పోయే పరిస్థితుల్లో యముడితో గొడవపడి మనల్ని కాపాడే వారే ప్రాణ స్నేహితులు..

ప్రేమను ముడిసరుకుగా పెట్టి.. బంధాలతో బేరం ఆడుతున్న మనుషుల మధ్య మనం బతుకుతున్నాం. ఇటువంటి స్వార్థపరుల మధ్య కూడా ఎక్కడో ఒక దగ్గర మంచివారు ఉండనే ఉన్నారు. మనుషులలో మానవత్వం ఇంకా మిగిలే ఉంది అని చెప్పడానికి కొన్ని సంఘటనలు ఆధారంగా నిలుస్తున్నాయి. తాజాగా.. కొందరు వ్యక్తులు లోయలో పడబోతున్న తమ స్నేహితుడిని కాపాడడానికి.. ప్రయత్నించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా క్షణాల్లో మనకు తెలిసిపోతోంది. నిత్యం కొన్ని లక్షల వీడియోలు నిమిషాల్లో షేర్ అయిపోతూ ఉన్నాయి. వాటిలో నెటిజన్లను ఆకట్టుకునేవి కొన్ని ఉంటే.. అందరికీ ఆదర్శంగా నిలిచేవి మరికొన్ని ఉంటున్నాయి. ఫ్రెండ్షిప్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో కొంతమంది మిత్రులు తమ స్నేహితుడిని మృత్యు బాట నుంచి బయటపడేలా చేశారు. వీడియోలో కనిపించే దృశ్యాలను పరిశీలిస్తే..

ఒక కారు మనిషితో సహా లోతైన లోయ అంచున ఆగిపోయి ఉంది. ఆ కార్ లోని వ్యక్తి మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి స్నేహితులు అతనిని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి వారి సాయంతో ఆ వ్యక్తి కారులోనుంచి నుంచి సేఫ్‌గా స్నేహితుల చేతులకు చిక్కాడు. వెంటనే కారు ఆ లోయలో పడిపోయింది. ఎట్టకేలకు మృత్యువు అంచున ఉన్న వ్యక్తిని అతని స్నేహితులు సేఫ్ గా కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను @HasnaZaruriHai అనే యూజర్ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

‘ఎవరికైతే స్నేహితులు సహాయంగా ఉంటారో వారి వద్ద నుంచి యమరాజు సైతం ఖాళీ చేతులతో వెళ్లాల్సిందే’ అని పేర్కొన్నాడు. ఇక హృదయాన్ని కదిలించే ఈ వీడియోను.. నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు. కొందరు ఈ వీడియోను చూసి ఆశ్చర్య పోతున్నారు. మైత్రికి నిదర్శనంగా నిలిచిన ఆ స్నేహితులను ప్రశంసలతో ముంచేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎవరికి నచ్చిన విధంగా వారు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ‘ఇది స్నేహంలోని బలం’ , ‘షాకింగ్ వీడియో’ అని కొందరు స్పందిస్తే.. మరికొందరు ‘వీడియో తీసిన వ్యక్తి కూడా వారికి సపోర్ట్ చేసుంటే కారును కూడా కాపాడేవారేమో’ అని స్పదింస్తున్నారు. ఏదేమైనా..మృత్యువు అంచున ఉన్న వారి మిత్రుడిని కాపాడి.. స్నేహానికి నిదర్శనంగా నిలిచారు ఈ వ్యక్తులు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments