Arjun Suravaram
Fake Marriages: పేద ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంటాయి. అయితే కొందరు అధికారులు అవినీతి సోమ్ము కోసం.. పేద కుటుంబాలకు చెందాల్సిన సొమ్మును కొట్టేస్తున్నారు. అందుకు కోసం విచిత్రమైన మార్గాలను ఎంచుకుంటున్నారు.
Fake Marriages: పేద ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంటాయి. అయితే కొందరు అధికారులు అవినీతి సోమ్ము కోసం.. పేద కుటుంబాలకు చెందాల్సిన సొమ్మును కొట్టేస్తున్నారు. అందుకు కోసం విచిత్రమైన మార్గాలను ఎంచుకుంటున్నారు.
Arjun Suravaram
సాధారణంగా పెళ్లి అంటే వధువరులు ఉండేనే జరుగుతుంది. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ వివాహ కార్యం అనేది జరగదు అనే విషయం మనకు తెలిసింది. చాలా మంది తమ పెళ్లిని ఘనంగా జరుపుకుంటారు. మరికొందరు చాలా సింపుల్ గా దేవాలయాల్లో, ఇతర ప్రార్థన మందిరాల్లో చేసుకుంటారు. ఇంకొందరు సాముహిక వివాహల్లో భాగంగా కలిసిపోయి తమ పెళ్లిని చేసుకుంటారు. ఎలా జరిగిన మాత్రం వధువరులు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఓ ప్రాంతంలో విచిత్రం చోటుచేసుకుంది. వరుడు లేకుండానే వందలాది మంది యువతులు పెళ్లి చేసుకున్నారు. వినడానికి ఆశ్చర్యమైన ఇది నిజం. ఎక్కడ జరిగింది,అసలు అలా ఎందుకు చేశారు.. ఆ వివరాలు తెలియాలంటే.. స్టోరీలోకి వెళ్లాల్సిందే.
జనవరి 25న ఉత్తర్ ప్రదేశ్ లోని బలియార్ జిల్లాలోని మనియర్ పట్టణ కాలేజిలలో సాముహిక వివాహలు నిర్వహించారు. అయితే ఈ పెళ్లికి ఎదురుగా వరుడు లేకుండానే వందలాది మంది యువతులు తమ మెడల్లో తామే వరమాలలు వేసుకుని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే యువతులు ఇలా వరుడు లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడానికి వెనుక ఉన్న కారణం తెలిసి అందరూ షాకయ్యారు. పేదల పెళ్లిళ్ల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం “ముఖ్యమంత్రి సామూహిక వివాహం వేడుక” అనే పథకాన్ని ప్రారభించింది. ఈ స్కీమ్ ద్వారా నిరుపేద కుటుంబాల యువతీ యువకులకు ఆర్థిక సాయం కింద 51 వేల రూపాయలు అందిస్తుంది. ఇలా ఎంతో మంది పేదలకు ఈ పథకం ద్వార ఆర్థిక సాయం లభిస్తుంది. అంతేకాక పేద కుటుంబాల్లో పెళ్లిళ్లు సంతోషంగా జరుగుతున్నాయి.
అయితే ఈ పథకాన్ని కొందరు అవినీతి పరులు తప్పుడు మార్గంలో వినియోగించుకుంటున్నారు. అక్రమంగా లబ్ధి పొందాలనే దురాశతో కొందరు అధికారులు బ్రోకర్లతో చేతులు కలిపారు. ఈ క్రమంలోనే జరిగినవే.. వరుడు లేని ఈ వందలాది యువతుల వివాహలు. జనవరి 25న మనియర్ పట్టణ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక పెళ్లిళ్ల కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకువచ్చారు. వివాహం కాని, వివాహమైన యువతీ యువకులకు డబ్బు ఆశ చూపారు. అగ్రిమెంట్ ప్రకారం వీరంతా దొంగ పెళ్లిళ్లు చేసుకున్నారు.
అనంతరం డబ్బులు తీసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చివరకు ఆ వీడియో పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగారు. పోలీసులు 8 మంది అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరికీ నిధులను విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్ తెలిపారు. ఇలా ఎంతో మంది కేటుగాళ్లు ప్రభుత్వ సొమ్మును అక్రమ మార్గాల్లో కొట్టేసి.. జేబులు నింపుకుంటున్నారు. ఇలా పేదలకు అందాల్సిన ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న ఇలాంటి దుర్మార్గులకు ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.