P Venkatesh
Indian Army: జమ్ముకశ్మీర్ లో ఘోరం చోటుచేసుకుంది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు.
Indian Army: జమ్ముకశ్మీర్ లో ఘోరం చోటుచేసుకుంది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు.
P Venkatesh
దేశంలో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. టెర్రరిస్టులు దాడులకు పాల్పడుతూ ఆస్తి, ప్రాణ నష్టాలకు కారకులవుతున్నారు. దేశ సంపదను, ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో జవాన్లు అసువులుబాస్తున్నారు. ఇళ్లు వాకిలి విడిచిపెట్టి దేశ సేవ కోసం పాటు పడే జవాన్లు ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్మీ జవాన్ల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటున్నది. తాజాగా జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీ జవాన్లే టార్గెట్ గా కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారు.
టెర్రరిజాన్ని రూపుమాపేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నప్పటికీ పూర్తిగా అడ్డుకట్ట పడడం లేదు. ఉగ్రవాదుల దాడుల్లో అమాయకపు ప్రజలు, ఆర్మీ జవాన్లు ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్ లో ఘోరం చోటుచేసుకుంది. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాచేడి- కిండ్లీ- మల్హార్ రోడ్డు మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆర్మీ జవాన్లే లక్ష్యంగా చేసుకుని పక్కా ప్లాన్ తో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ కాన్వాయ్ పై గ్రనేడ్ విసిరి ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అదనపు బలగాలు అక్కడికి చేరుకొని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులు వరుసగా దాడులకు పాల్పడుతుండడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులను ఏరివేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.