iDreamPost
android-app
ios-app

మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూత!

  • Published Feb 23, 2024 | 7:43 AM Updated Updated Feb 23, 2024 | 7:43 AM

మాజీ ముఖ్యమంత్రి, లోక్​సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి (86) కన్నుమూశారు. దీంతో నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానాన్ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు.

మాజీ ముఖ్యమంత్రి, లోక్​సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి (86) కన్నుమూశారు. దీంతో నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానాన్ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు.

  • Published Feb 23, 2024 | 7:43 AMUpdated Feb 23, 2024 | 7:43 AM
మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూత!

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి (86) కన్నుమూశారు. ముంబైలోని ప్రముఖ హిందూజా ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ అర్ధరాత్రి 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మనోహర్ జోషి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కొన్ని నెలల కింద జోషి మెదడులో రక్తస్రావం కారణంగా హిందూజా హాస్పిటల్​లో జాయిన్ అయ్యారు. ఆయన పరిస్థితి నిలకడగా మారిన తర్వాత డాక్టర్లు డిశ్చార్జి చేస్తామని చెప్పిన క్రమంలోనే ఇలా జరగడం విచారకరం. అనారోగ్య కారణాల వల్ల జోషి కొన్నాళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్​కు దూరంగా ఉంటున్నారు.

శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత బాలాసాహెబ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుల్లో జోషి ఒకరు. 1995 నుంచి 1999 వరకు మహారాష్ట్రకు జోషి ముఖ్యమంత్రిగా ఉన్నారు. శివసేన నుంచి ఆ రాష్ట్రానికి సీఎం అయిన మొదటి నేత కూడా మనోహర్ కావడం విశేషం. ముఖ్యమంత్రిగానే గాక ఎంపీగా, లోక్​సభ స్పీకర్​గా కూడా జోషి సేవలు అందించారు. అప్పటి అటల్ బిహారి వాజ్​పేయి ప్రభుత్వంలో 2002 నుంచి 2004 వరకు లోక్​సభ స్పీకర్​గా ఉన్నారు జోషి. 1995 మార్చిలో ఆయన మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఎంపీ, సీఎం, లోక్​సభ స్పీకర్​ లాంటి పదవుల్లో తనదైన మార్క్​ను క్రియేట్ చేశారు మనోహర్ జోషి. రాజకీయాల్లో ఎంతో పేరు గడించిన ఆయన పేద కుటుంబం నుంచి వచ్చారు. 1937, డిసెంబర్ 2వ తేదీన రాయ్​గఢ్​ జిల్లాలోని ఝలాలో ఆయన జన్మించారు. బాల్యం నుంచే అనేక అంశాల మీద వ్యవస్థపై పోరాడాలని నిర్ణయించుకొని పాలిటిక్స్​లోకి వచ్చారు. అనంతరం ముంబై మున్సిపల్ కార్పొరేషన్​కు కార్పొరేటర్, మేయర్​, లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు, ఎమ్మెల్యే, మహారాష్ట్ర సీఎం, ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి, లోక్​సభ స్పీకర్​, రాజ్యసభ సభ్యుడు లాంటి పలు హోదాల్లో పని చేస్తూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.

ఇదీ చదవండి: నాగబాబు కూతురు నిహారిక పొలిటికల్ ఎంట్రీ.. పోటీ అక్కడ నుంచేనా?