iDreamPost

నాగబాబు కూతురు నిహారిక పొలిటికల్ ఎంట్రీ.. పోటీ అక్కడ నుంచేనా?

Niharika Political Entry: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి సంబంధించిన సెన్సేషన్ న్యూస్ సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తుంది.

Niharika Political Entry: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి సంబంధించిన సెన్సేషన్ న్యూస్ సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తుంది.

నాగబాబు కూతురు నిహారిక పొలిటికల్ ఎంట్రీ.. పోటీ అక్కడ నుంచేనా?

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రజల్లోకి ఎవరి వ్యూహాలతో వారు వెళ్తున్నారు. అధికార పార్టీ వైసీపీ.. ఇప్పటి వరకు ఏపీలో తాము చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కాన్సెప్ట్ తో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు పలు బహిరంగ సభలు, ర్యాలీలతో అధికార ప్రభుత్వంపై విమర్శలు గుప్తిస్తూ ప్రజల మద్యకు వెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించేందుకు టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మెగా బ్రదర్స్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఏపీలో జరగబోయే ఎన్నికల్లో నేపథ్యంలో ఆసక్తికర విషయం ప్రచారంలోకి వచ్చింది. మెగాబ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన ప్రదాన కార్యదర్శి నాగబాబు కూతురు కొణిదెల నిహారిక 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతుందని.. అది కూడా కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న తిరుపతి నుంచి.. ఆమె గెలుపు ఖాయం అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. వాటన్నింటికి పులిస్టాప్ పడింది. హీరో వరుణ్ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్ ’ మూవీ ప్రమోషన్ లో భాగంగా రాజమండ్రి పర్యటించారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ వచ్చే ఎన్నికల్లో ప్రచారం, తన కుటుంబ సభ్యుల పోటీపై క్లారిటీ ఇచ్చారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘ఎన్నికలు అనేది చాలా సున్నితమైన అంశం.. ఎన్నికల్లో పోటీ గురించి కుటుంబ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మేం దాన్ని ఫాలో అవుతాం. ఎవరెన్ని విషయాలు మాట్లాడినా.. ఫైనల్ గా కుటుంబంలోని పెద్దదే తుది నిర్ణయం. పెదనాన్న, నాన్న, బాబాయ్ ఏది చెబితే తాము అంతా పాటిస్తాం. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయమంటే చేస్తాం.. అనకాపల్లి నుంచి నాన్న తరుపు నుంచి ప్రచారం చేసే విషయంలో పెద్దవాళ్లు ఎలా చెబితే అలా నడుచుకుంటాను. తిరుపతి నుంచి నిహారిక పోటీ చేస్తుందని ఎవరు చెప్పారో కానీ.. అది అవాస్తవం. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు’ ఇప్పటి వరకు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఉస్సురుమంటుంది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి మగవారే పోటీలో ఉన్నారు.. మొదటి సారి ఆడవాళ్లు ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ భావించినప్పటికీ అదంతా పుకార్లు అని తేలడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి