బ్రేకింగ్.. మాజీ CM కారుకు ప్రమాదం.. తృటిలో ఎస్కేప్

ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో కన్నా.. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదాలకు సెలబ్రిటీలేమీ అతీతులు కాదూ. తాజాగా ప్రముఖ నేత, మాజీ ముఖ్యమంత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో కన్నా.. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదాలకు సెలబ్రిటీలేమీ అతీతులు కాదూ. తాజాగా ప్రముఖ నేత, మాజీ ముఖ్యమంత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

రోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి రెట్టింపు అవుతుంది. రోడ్డు యాక్సిడెంట్ల కారణంగా కుటుంబాలకు కుటుంబాలు తుడుచుకు పెట్టుకుపోతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రలేమి, నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్ ఇతర కారణాలు ఈ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో సామాన్యులే కాదూ సెలబ్రిటీలు కూడా మరణించిన సంగతి విదితమే. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కారు ప్రమాదానికి గురైంది. అయితే తృటిలో ప్రాణ పాయం నుండి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆ నేత కుమార్తె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ తృటిలో పెను ప్రమాదం నుండి బయట పడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన అనంత నాగ్ జిల్లాలో జరిగింది. ప్రమాదం ధాటికి కారు ఫ్రంట్ పూర్తిగా దెబ్బతింది. నల్లటి స్కార్పియో బానెట్ వంకర పోయింది. ఈ విషయాన్ని ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ఎక్స్ లో ట్వీట్ చేశారు. దేవుడి దయ వల్ల ఆమె, భద్రతా అధికారులకు ఎలాంటి గాయాలు జరగలేదని, వారంతా సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి.. మాజీ జమ్ము కాశ్మీర్ మంత్రి ఒమర్ అబ్దుల్లా.. ముఫ్తీ ప్రమాదం నుండి బయటపడటంతో సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ ప్రమాదంలో వ్యక్తిగత భద్రత సిబ్బందిలో ఓ పోలీసు అధికారికి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది.

Show comments