Flooded Water Falls: పిల్లలతో వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తున్నారా? ఈ వీడియో చూస్తే మనసు మార్చుకుంటారు..

పిల్లలతో వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తున్నారా? ఈ వీడియో చూస్తే మనసు మార్చుకుంటారు..

వేసవి కాలం సెలవులకి పిల్లలతో వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లడం అంత సేఫ్ కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాదని సరదా పడి వెళ్తే పెద్దలతో పాటు పిల్లలు కూడా ప్రమాదంలో చిక్కుకుంటారు.

వేసవి కాలం సెలవులకి పిల్లలతో వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లడం అంత సేఫ్ కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాదని సరదా పడి వెళ్తే పెద్దలతో పాటు పిల్లలు కూడా ప్రమాదంలో చిక్కుకుంటారు.

పిల్లలకు వేసవి కాలం సెలవులు కావడంతో తల్లిదండ్రులు వాళ్ళని సరదాగా బయటకు తీసుకెళ్లడం మామూలే. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలని మ్యూజియంలకి, ప్రముఖ సందర్శనా స్థలాలకు తీసుకెళ్తుంటారు. కొంతమంది మాత్రం పిల్లలను వాటర్ ఫాల్స్ దగ్గరకు తీసుకెళ్తుంటారు. అయితే ఇలాంటి తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదంలో పడతారు. మీరు మాత్రమే కాకుండా మీ పిల్లల్ని కూడా ప్రమాదంలో పడేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయం తెలిస్తే మీరు వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లే ముందు ఆలోచిస్తారు. 

వేసవి కాలం కావడంతో వాటర్ ఫాల్స్ దగ్గర ఆ వచ్చే జలధారని ఆస్వాదించాలని అనుకుంటారు. అయితే ఉన్నట్టుండి వాతావరణం మారడంతో వర్షాలు పలకరించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే కొంతమంది పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించేందుకు వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లారు. పిల్లలతో కలిసి మరీ వెళ్లారు. అందరూ వాటర్ ఫాల్స్ కింద స్నానం చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా వరద నీరు ఉప్పొంగుతూ వచ్చింది. దీంతో జనం భయపడి పరుగులు తీశారు.     

ఈ ఘటన తమిళనాడులోని కుట్రాళం వాటర్ ఫాల్స్ వద్ద చోటు చేసుకుంది. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా అక్కడ కొండ ప్రాంతాల్లోని వాటర్ ఫాల్స్ జలకళను సంతరించుకున్నాయి. దీంతో పర్యాటకులు కుట్రాళం వాటర్ ఫాల్స్ కి క్యూ కట్టారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి వాటర్ ఫాల్స్ కింద సంతోషంగా తడుస్తూ ఆ నీటి జల్లులను ఆస్వాదిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా వాటర్ ఫాల్స్ పై కొండ నుంచి వరద ఉప్పొంగింది. వరద నీరు ఒక్కసారిగా మీదకు వస్తుండడంతో జనం పరుగులు తీశారు. అయితే ఆ సమయంలో 16 ఏళ్ల కుర్రాడు మాత్రం ఆ వరదల్లో చిక్కుకుపోయాడు. ఓ పెద్దాయన బాలుడ్ని పిలిచినా రాకపోవడంతో ఆ కుర్రాడు ఆ వరదల్లో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం కుర్రాడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తమిళనాడు అగ్నిమాపక సిబ్బంది, రక్షణ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. కలెక్టర్ ఏకే కమల్ కిషోర్, ఎస్పీ టీపీ సురేష్ కుమార్ కూడా అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా వాటర్ ఫాల్స్ ని సందర్శించడానికి లేకుండా మూసివేశారు. ఎవరూ రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి సమ్మర్ సీజన్ అయినప్పటికీ అనుకోని వర్షాలు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో పిల్లలని ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరకు తీసుకెళ్లకుండా ఉండడమే మంచిది.

Show comments