Himachal Pradesh Heavy Rains:వీడియో:వర్షాల బీభత్సం.. 5 సెకండ్లలో కుప్పకూలిన భవనం!

వీడియో:వర్షాల బీభత్సం.. 5 సెకండ్లలో కుప్పకూలిన భవనం!

Himachal Pradesh Heavy Rains: ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి.. బ్రిడ్జీలు కుప్పకూలి పోతున్నాయి.

Himachal Pradesh Heavy Rains: ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి.. బ్రిడ్జీలు కుప్పకూలి పోతున్నాయి.

ఉత్తరాదిలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యమైన నదుల్లో నీటి ప్రవాహం భారీగా పెరిగిపోయింది. గత కొన్నిరోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ చిగురుటాకులా వణికిపోతుంది. భారీ వర్షాల కారణంగా సిమ్లా జిల్లా రామ్‌పూర్ సమేజ్ ఖాడ్ ప్రాంతంలో 20 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు సిమ్లా డిప్యూటీ కమీషనర్ అనుపమ్ కాశ్యప్ గురువారం వెల్లడించారు. తెల్లవారు జామున కొన్ని ప్రాంతాల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు బెంబెలెత్తిపోయారు. మరోవైపు సహాయక చర్యలు చురుకుగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లోని కులులో గురువారం తెల్లవారుజామున పార్వతి నది ఉగ్ర ప్రవాహానికి ఓ భవనం కుప్పకూలి పోయింది. భారీ వర్షాల కారణంగా పార్వతి నది ఉప్పొంగి ప్రవాహం ఉద్రితికి భవనం కూలిపోయింది. కేవలం 5 సెకన్లలోనే ఈ భవనం కూలినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌లో కులు జిల్లాలలోని తోష్‌లో భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా ఒక ఫుట్ బ్రిడ్జ్, పక్కనే ఉన్న మద్యం దుకాణంతో పాటు మూడు తాత్కాలిక దుకాణాలు కొట్టుకుపోయాయి. మంగళవారం తెల్లవారు జామున మణికరన్ లోని తోష్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని డిప్యూటీ కమీషనర్ తోరూల్ ఎస్ రవిష్ తెలిపారు. సంఘటన తర్వాత పరిస్థితిని అంచనా వేయడానికి ఒక బృందాన్ని పంపినట్లు ఆయన తెలిపారు. కేవలం 5 సెకన్లలోనే బ్రిడ్జ్ కుప్పకూలిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ ఘటన గురించి డిప్యూటీ కమీషనర్ ఎస్ రవీష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ హిమాచల్ ప్రదేశ్ లో భారీగా వర్షాలు పడుతున్నాయి.. తోష్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఫుట్ బ్రిడ్జీ, వైన్ షాప్, మూడు తాత్కాలిక దుకాణాలు కొట్టుకుపోయాయి. కాకపోతే ఈ సంఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పునరుద్దరణ కోసం బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి’ అని న్నారు. భారీ వర్షాలు పడుతున్న కారణంగా నదులు, వాగులకు దూరంగా ఉండాలని, నల్లాల దగ్గర తాత్కాలిక నిర్మాణాలు చేయవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బ్రిడ్జీ కూలిపోతున్న దృష్యం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Show comments