iDreamPost
android-app
ios-app

గేమింగ్ జోన్ లో అగ్ని ప్రమాదం.. 24 మంది సజీవదహనం!

Fire Breaks Out In Gaming Zone: ఒక గేమింగ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 24 మంది సజీవ దహనం అయ్యారు. చాలామంది ఈ అగ్నిప్రమాదంలో గాయాల పాలయ్యారు. ముఖ్యమంత్రి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమయ్యారు.

Fire Breaks Out In Gaming Zone: ఒక గేమింగ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 24 మంది సజీవ దహనం అయ్యారు. చాలామంది ఈ అగ్నిప్రమాదంలో గాయాల పాలయ్యారు. ముఖ్యమంత్రి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమయ్యారు.

గేమింగ్ జోన్ లో అగ్ని ప్రమాదం.. 24 మంది సజీవదహనం!

ఒక గేమింగ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. ఈ భారీ అగ్నిప్రమాదంలో 24 మంది సజీవదహనం అయ్యారు. గేమింగ్ జోన్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అక్కడి ప్రాంతాన్ని కమ్మేసింది. మంటల్లో చిక్కుకున్న వారి ఆర్తనాదాలతో అక్కడి ప్రాంతం కంపించి పోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఘటనాస్థలానికి భారీగా ఫైర్ ఇంజన్లను తరలించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. శనివారం కావడంతో గేమింగ్ జోన్ లో తాకిడి ఎక్కువగా ఉంది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.

ఈ హృదయ విధారకర ఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగింది. అక్కడి గేమింగ్ జోన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగా ఆ మంటలు చుట్టూ వ్యాపించాయి. ఈ ఘటనలో ఇప్పటికే 24 మంది సజీవదహనం అయ్యారు. ఇంకా మంటల్లో ఎంతో మంది చిక్కుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు, ఫైర్ సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దఎత్తున ఫైర్ ఇంజిన్ల తీసుకొచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. శనివారం కావడంతో గేమ్ జోన్లో ఆటలు ఆడేందుకు పెద్దఎత్తున పిల్లలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు పెద్దఎత్తున వ్యాపించాయని అక్కడున్న వాళ్లు చెబుతున్నారు.

గేమింగ్ జోన్ లో చాలామంది చిక్కుకున్నారని.. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు కూడా వెల్లడించారు. మృతుల్లో చిన్న పిల్లలు, మహిళలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ భారీ అగ్నిప్రమాదంపై గుజరాత్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలానికి అంబులెన్సులు పంపాలని కోరారు. చికిత్స కోసం ఆస్పత్రులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ హృదయ విధారకర దృశ్యాలు చూసి నెటిజన్స్ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎలాగైన పరిస్థితిని అదుపు చేసి మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అయితే అసలు ఎలా మంటలు వ్యాపించాయి? ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది విచారణ చేయనున్నారు.