SNP
SNP
ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన తర్వాత వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైళ్లలో పొగలు రావడం, మంటలు చెలరేగడం లాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మధురై టూరిస్ట్ రైలులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధురై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. రామేశ్వరం నుంచి లక్నో వెళ్తున్న ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ రైలును శుక్రవారం రాత్రి మధురై-బోడి ట్రాక్‌పై నిలిపిఉంచారు. శనివారం ఉదయం 5.30 గంటలకు ఈ టూరిస్ట్ రైలు వంట కంపార్ట్‌మెంట్‌లోని సిలిండర్ పేలి మంటలు చెలరేగినట్లు సమాచారం.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ప్రమాద సమయంలో 90 మందిలో 80 మందికి పైగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. తొలుత ఐదుగురి మృతి చెందినట్లు వెల్లడించిన అధికారులు.. ఆ తర్వాత మృతుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు ప్రకటించారు. ప్రమాద విషయం తెలియగానే దక్షిణ రైల్వే అదనపు మేనేజర్ కౌశల్ ఘోషన్, రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ ఐజీ సంతోష్ చంద్రన్ సహా పలువురు అధికారులు మదురైకి బయలుదేరారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#FireAccident #MaduraiRailwayStation, #Madurai, #IndianRailways #Railways, #TamilNadu pic.twitter.com/dpasgiSlDc
— Sayyad Nag Pasha (@nag_pasha) August 26, 2023
ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన జీపు..