iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ హౌస్ లో.. పహల్గాం దాడిలో భర్తను కోల్పోయిన హిమాన్షి..?

  • Published Aug 11, 2025 | 11:10 AM Updated Updated Aug 11, 2025 | 11:10 AM

బిగ్ బాస్ మేకర్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేవారిని చూస్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలో హిమన్షిని హౌస్ లోకి తీసుకుని వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబందించిన ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు.

బిగ్ బాస్ మేకర్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేవారిని చూస్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలో హిమన్షిని హౌస్ లోకి తీసుకుని వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబందించిన ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు.

  • Published Aug 11, 2025 | 11:10 AMUpdated Aug 11, 2025 | 11:10 AM
బిగ్ బాస్ హౌస్ లో..  పహల్గాం దాడిలో భర్తను కోల్పోయిన హిమాన్షి..?

బిగ్ బాస్ హౌస్ లిస్ట్ లో రోజుకు ఓ కొత్త వార్తా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హిమాన్షి నర్వాల్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్. దేశాన్ని కుదిపేసిన పహాల్గమ్ ఎటాక్ ఎలాంటి పరిస్థిలకు దారి తీసిందో తెలియనిది కాదు. హిమన్షి హనీమూన్ కు అని వెళ్లి తన భర్తను కోల్పోయారు.

వారికి సంబందించిన ఫోటోలు , వీడియో లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు బిగ్ బాస్ మేకర్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేవారిని చూస్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలో హిమన్షిని హౌస్ లోకి తీసుకుని వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబందించిన ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి.. ఆమెను సంప్రదించే ఛాన్స్ ఏ లేదని అంటున్నారు. అయితే ఇదంతా తెలుగు బిగ్ బాస్ గురించి అనుకుంటే పొరబడినట్టే.

ఆగస్ట్ 14 నుంచి హిందీ బిగ్ బాస్ సీజన్ 19 స్టార్ట్ అవుతుంది. ఆ బిగ్ బాస్ హౌస్ లోకి హిమన్షి వస్తుందని టాక్. గతంలో ఓ సారి బిగ్‌బాస్ OTT 2 విన్నర్ ఎల్విష్ యాదవ్ తన వ్లాగ్‌లో హిమాన్షి తన కాలేజ్ మేట్ అని చెప్పారు. సో ఈ రకంగా చూసుకున్నా ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇక ఆమె ఎంట్రీ నిజమా కాదా అనేది షో స్టార్ట్ అయ్యే ముందే క్లారిటీ వస్తుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.