iDreamPost
android-app
ios-app

తారక్ కాలర్ ఎగరేశాడంటే.. ఈసారి కూడా !

  • Published Aug 11, 2025 | 10:21 AM Updated Updated Aug 11, 2025 | 10:21 AM

ఎస్ తారక్ ఈసారి కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కాలర్ ఎగరేశాడు. అంటే ఈ బొమ్మ కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో తారక్ కాలర్ ఎగరేసి చెప్పిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం చేశాయి. సో వార్ 2 కూడా అదే బాటలో కొనసాగుతుందని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు

ఎస్ తారక్ ఈసారి కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కాలర్ ఎగరేశాడు. అంటే ఈ బొమ్మ కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో తారక్ కాలర్ ఎగరేసి చెప్పిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం చేశాయి. సో వార్ 2 కూడా అదే బాటలో కొనసాగుతుందని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు

  • Published Aug 11, 2025 | 10:21 AMUpdated Aug 11, 2025 | 10:21 AM
తారక్ కాలర్ ఎగరేశాడంటే.. ఈసారి కూడా !

ఎస్ తారక్ ఈసారి కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కాలర్ ఎగరేశాడు. అంటే ఈ బొమ్మ కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో తారక్ కాలర్ ఎగరేసి చెప్పిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం చేశాయి. సో వార్ 2 కూడా అదే బాటలో కొనసాగుతుందని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వార్ 2 కి ప్రమోషన్స్ తగ్గాయి.. సౌండ్ వినిపించడంలేదు.. ట్రైలర్ సరిగా లేదు అని ఇలా చాలానే మాటలు వినిపించాయి. ఇదంతా కేవలం రేస్ లో కూలీ ఉంది కాబట్టి కంపారిజన్ తో వచ్చిన మాటలు. ఒకవేళ వార్ 2 కనుక సోలో ఎంట్రీ ఇస్తే ఇలాంటి నెగిటివిటి వచ్చేది కాదు. ఏదైతేనేం తారక్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈవెంట్ జరిగిపోయింది.

ఈవెంట్ లో కనుల పండుగగా హృతిక్ తారక్ ఒకే స్టేజ్ మీద కనిపించడం అందరిని ఇంప్రెస్స్ చేసింది. బహుశా ఓ బాలీవుడ్ హీరో టాలీవుడ్ లో ఇక్కడ హీరోతో స్టేజ్ షేర్ చేసుకుని.. ఓ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అవ్వడం ఇదే మొదటిసారేమో. అందుకే అంటారు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మామూలోడు కాదని. స్ట్రెయిట్ గా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టినప్పుడే తారక్ అభిమానులు ఫుల్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. ఇక నిన్నటి ఈవెంట్ తో ఇప్పటివరకు సినిమా మీద స్ప్రెడ్ అయిన నెగిటివిటి అంతా తుడిచిపెట్టుకు పోయింది. కన్ఫర్మ్ గా వార్ 2 హిట్ అవుతుందని టీం తో పాటు.. అభిమానులు , ప్రేక్షకులు కూడా బలంగా నమ్ముతున్నారు.

పైగా బాలీవుడ్ టాప్ హీరో అయిన హృతిక్.. జూనియర్ ఎన్టీఆర్ ను కొనియాడుతుంటే టాలీవుడ్ కే గర్వకారణం అని సోషల్ మీడియాలో అంతా కామెంట్స్ చేస్తున్నారు. తారక్ తన గురువు అని హృతిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పిన మాటలు అందరిని ఖుషి చేశాయి. మొత్తానికి అప్పటివరకు సైలెంట్ గా ఉన్న టీం ఒక్క ప్రీరిలీజ్ ఈవెంట్ తో భారీ సౌండ్ చేసినట్టు అయింది. ఇక వార్ 2 రిలీజ్ రోజున థియేటర్స్ లో ఎలాంటి సౌండ్స్ వినిపిస్తాయో చూడాలి. సినిమాకు ఇంకా 3 రోజుల సమయమే ఉంది కాబట్టి.. ఈలోపు వార్ 2 టీం సినిమాకు సంబంధించిన ఇంకేమైనా అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.