iDreamPost
android-app
ios-app

కూలి టికెట్స్ రేట్స్ పై డిస్కషన్స్

  • Published Aug 12, 2025 | 10:48 AM Updated Updated Aug 12, 2025 | 10:48 AM

కూలీ సినిమా విషయంలో ప్రేక్షకులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా టికెట్ రేట్స్ విషయంలో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. నిజమే తెలుగు వారికి సినిమాలంటే విపరీతమైన అభిమానం.

కూలీ సినిమా విషయంలో ప్రేక్షకులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా టికెట్ రేట్స్ విషయంలో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. నిజమే తెలుగు వారికి సినిమాలంటే విపరీతమైన అభిమానం.

  • Published Aug 12, 2025 | 10:48 AMUpdated Aug 12, 2025 | 10:48 AM
కూలి టికెట్స్ రేట్స్ పై డిస్కషన్స్

కూలీ సినిమా విషయంలో ప్రేక్షకులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా టికెట్ రేట్స్ విషయంలో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. నిజమే తెలుగు వారికి సినిమాలంటే విపరీతమైన అభిమానం. కంటెంట్ బావుంటే కనుక అది స్ట్రెయిట్ తెలుగు సినిమానా లేదా డబ్బింగ్ సినిమానా అని తేడా లేకుండా… మౌత్ పబ్లిసిటీ చేసేస్తారు. కానీ ఆ క్రేజ్ ను అభిమానాన్ని క్యాష్ చేసుకోడానికి టికెట్స్ రేట్స్ పెంచడం కరెక్ట్ కాదని TFI అభిమానులు సోషల్ మీడియాలో వాపోతున్నారు.

అసలు మ్యాటర్ ఏంటంటే.. టికెట్స్ పెరిగినట్టు అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ. లీకుల రూపంలో వచ్చిన కొన్ని వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. నైజం మల్టిప్లెక్స్ ల్లో కూలి మూవీ చూడాలంటే 350 నుంచి 453 రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుందట. కానీ ఇదే సినిమా చెన్నైలో మాత్రం ఇందులో సగం రేట్ కే అందుబాటులోకి వస్తుందంట. ఇలా ఒకటే సినిమాకు రెండు స్టేట్స్ లో వేర్వేరు ధరలు ఉండడం హాట్ టాపిక్ గా మారింది. వార్ 2 కూడా ఇంచుమించు ఇదే స్ట్రాటజీ ఫాలో కానుందని టాక్.

ఈ రేట్స్ తెలంగాణతో పాటు అటు ఏపీ కి వర్తించేలా ఉన్నాయని అంటున్నారు. ప్రాక్టికల్ గా చూస్తే రెండు డబ్బింగ్ సినిమాలే. వార్ 2 మెయిన్ టార్గెట్ బాలీవుడ్.. ఇటు కూలీ మెయిన్ టార్గట్ తమిళనాడు ప్రేక్షకులు. కానీ అక్కడ నార్మల్ రేట్స్ ఉంచి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇంత రేట్స్ పెంచడం సరైనది కాదని వాదన. మరి దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్సుమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు సోషల్ మీడియాలో ఈ డిస్కషన్స్ ఆగేలా అయితే లేవు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.