iDreamPost
android-app
ios-app

ఫెడరేషన్ , ఫిలిం ఛాంబర్ వివాదాలు తేలేదెప్పుడు ?

  • Published Aug 11, 2025 | 12:10 PM Updated Updated Aug 11, 2025 | 12:10 PM

ఫిలిం ఛాంబర్ , ఫిలిమ్ ఫెడరేషన్ ఉద్యోగులకు మధ్యన వేతనాల పెంపు విషయంలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ రెండు మూడు రోజుల్లో వివాదం తేలిపోతుంది.. సమస్యకు పరిష్కారం వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ వివాదం అంతా ఈజీగా తేలేలా కనిపించడం లేదు.

ఫిలిం ఛాంబర్ , ఫిలిమ్ ఫెడరేషన్ ఉద్యోగులకు మధ్యన వేతనాల పెంపు విషయంలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ రెండు మూడు రోజుల్లో వివాదం తేలిపోతుంది.. సమస్యకు పరిష్కారం వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ వివాదం అంతా ఈజీగా తేలేలా కనిపించడం లేదు.

  • Published Aug 11, 2025 | 12:10 PMUpdated Aug 11, 2025 | 12:10 PM
ఫెడరేషన్ , ఫిలిం ఛాంబర్ వివాదాలు తేలేదెప్పుడు ?

ఫిలిం ఛాంబర్ , ఫిలిమ్ ఫెడరేషన్ ఉద్యోగులకు మధ్యన వేతనాల పెంపు విషయంలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ రెండు మూడు రోజుల్లో వివాదం తేలిపోతుంది.. సమస్యకు పరిష్కారం వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ వివాదం అంతా ఈజీగా తేలేలా కనిపించడం లేదు. వేతనాల్లో 30% పెంపు కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని ఫిలిం ఫెడరేషన్ ఉద్యోగులు భీష్మించుకుని కూర్చున్నారు. అది సాధ్యం కాదని ఆదాయాన్ని బట్టి పనిని బట్టి పెంచుకుంటూ వెళ్తామని నిర్మాతలు చెప్పారు. కానీ ఇరు వర్గాల మధ్యన ఏకాభిప్రాయం కుదరలేదు. ఐటీ ఉద్యోగులు కంటే కూడా వీరికే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల వాదన. కానీ కొన్నేళ్ల నుంచి తమకు ఎలాంటి హైక్ లేదనీయో కార్మికుల వాదన.

దీనితో రోజు రోజుకి సమస్య పెరుగుతూ పోతుంది. దీనితో షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఈ భారం అంతా చిన్న పెద్ద ప్రొడ్యూసర్లు భరించాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా సెప్టెంబర్ , అక్టోబర్ లో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాలకు డెడ్ లైన్స్ దగ్గర పడుతున్నాయి. వారికి ఇది అగ్ని పరీక్షలనే ఉంది. ఒకవేళ డేట్స్ కానీ మిస్ అయ్యాయా వారికి ఓటిటి ఒత్తిళ్లు , బయ్యర్ల నుంచి ప్రెజర్లు మాములుగా ఉండవు. ఇదంతా ఓ తలనొప్పయితే.. కొత్త డేట్స్ వెతుక్కోవడం ఇంకా కష్టం. సో ముందు ముందు ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకోకుండా ప్రస్తుతం వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు.. శతవిధాలా ప్రయత్నిస్తున్నారంట నిర్మాతలు. అయినా సరే సర్దుబాటు జరగడం లేదని టాక్.

అటు సినీ నటులు నుంచి దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. సో ఈ సమస్యకు ఇప్పుడు ఎవరు చెక్ పెడతారన్నదే పెద్ద ప్రశ్న . ఫిలిం ఛాంబర్ కు ఫెడరేషన్ కు మధ్యలో మూడో వ్యక్తి చొరవ అయితే కచ్చితంగా ఉంది. మరి అది అగ్ర హీరో రూపంలో వస్తుందా రాజాకీయంగా వస్తుందా అనేదే అంతుచిక్కని సమాధానం. అప్పటివరకు వేచి చూడాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.