iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ లో సంథింగ్ స్పెషల్.. ఈసారి వాళ్ళు కూడా !

  • Published Aug 12, 2025 | 12:35 PM Updated Updated Aug 12, 2025 | 12:35 PM

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఇస్తున్న ప్రమోషనల్ కంటెంట్ అలాంటిది. కామన్ పీపుల్ వస్తున్నారంటూ.. అసలు బిగ్ బాస్ ఏ ఉండరంటూ.. డబుల్ హౌస్ డబుల్ డోస్ అంటూ ఇలా బ్యాక్ టు బ్యాక్ హాట్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఇస్తున్న ప్రమోషనల్ కంటెంట్ అలాంటిది. కామన్ పీపుల్ వస్తున్నారంటూ.. అసలు బిగ్ బాస్ ఏ ఉండరంటూ.. డబుల్ హౌస్ డబుల్ డోస్ అంటూ ఇలా బ్యాక్ టు బ్యాక్ హాట్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.

  • Published Aug 12, 2025 | 12:35 PMUpdated Aug 12, 2025 | 12:35 PM
బిగ్ బాస్ లో సంథింగ్ స్పెషల్.. ఈసారి వాళ్ళు కూడా !

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఇస్తున్న ప్రమోషనల్ కంటెంట్ అలాంటిది. కామన్ పీపుల్ వస్తున్నారంటూ.. అసలు బిగ్ బాస్ ఏ ఉండరంటూ.. డబుల్ హౌస్ డబుల్ డోస్ అంటూ ఇలా బ్యాక్ టు బ్యాక్ హాట్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో కంటే ముందు ఇప్పుడు అగ్నిపరీక్ష అనే షో రానుంది.

సీజన్ 9 కామన్ మ్యాన్ క్యాటగిరిలో చాలా ఎక్కువ మంది ఉండేలా చూసుకుంటున్నారు. దానికోసం ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందట. ఇప్పటికే బిగ్ బాస్ టీం 40 మందికి సెలెక్ట్ చేశారట. ఈ 40 మందికి అగ్నిపరీక్ష అనే షో లో కొన్ని షోస్ పెట్టి … ఇచ్చిన టాస్క్ లను ఫినిష్ చేసిన వారికి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారట. అయితే ఈ షో కి జడ్జ్ లుగా బిగ్ బాస్ ఓల్డ్ సీజన్స్ లో తమ ప్రతిభను కనబరిచిన వారు ఉండనున్నారట. అందులో అభిజిత్ , నవదీప్ , గీతామాధురి నేమ్స్ వినిపిస్తున్నాయి. నవదీప్ సీజన్ 1 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి షో కి కొత్త సందడి తీసుకొచ్చాడు.

గీతామాధురి బిగ్ బాస్ సీజన్ 2 లో రన్నర్ అప్ గా నిలిచారు. ఇక అభిజిత్ సీజన్ 4 లో విన్నర్. బిగ్ బాస్ సైతం అభిజిత్ ను కొనియాడడం గురించి తెలియనిది కాదు. ఇక ఈ షో కు యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తున్నారట. సో అసలు కామన్ పీపుల్ కి ఎలాంటి టాస్క్ లు ఇస్తారు, నాగార్జున ఈసారి ఎలాంటి రూల్స్ పెట్టబోతున్నారు. వారికి ఇచ్చిన టాస్క్ లో నుంచి ఈ ముగ్గురు జడ్జ్ లు వారిని ఎలా ఎంపిక చేస్తారు. ఇవన్నీ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ఈసారి బిగ్ బాస్ మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉండనుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.