iDreamPost
android-app
ios-app

వీడియో: తమన్నా సాంగ్​కు ఏనుగు మాస్ డ్యాన్స్.. చూస్తే షాకవ్వాల్సిందే!

  • Published Feb 28, 2024 | 9:06 PM Updated Updated Feb 28, 2024 | 9:06 PM

ఏనుగు డ్యాన్స్ చేయడం చూశారా? అది కూడా మామూలుగా కాదు.. హీరోయిన్ తమన్నా సాంగ్​కు మాస్ స్టెప్స్ వేయడం. ఏనుగు ఏంటి? డ్యాన్స్ ఏంటని షాకవుతున్నారా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

ఏనుగు డ్యాన్స్ చేయడం చూశారా? అది కూడా మామూలుగా కాదు.. హీరోయిన్ తమన్నా సాంగ్​కు మాస్ స్టెప్స్ వేయడం. ఏనుగు ఏంటి? డ్యాన్స్ ఏంటని షాకవుతున్నారా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

  • Published Feb 28, 2024 | 9:06 PMUpdated Feb 28, 2024 | 9:06 PM
వీడియో: తమన్నా సాంగ్​కు ఏనుగు మాస్ డ్యాన్స్.. చూస్తే షాకవ్వాల్సిందే!

ఏనుగు.. మిగిలిన ఏ జంతువుకు లేని ఆకర్షణ దీనికి ఉంటుంది. ఆకారంలో భారీగా ఉన్నా ఏనుగును చూస్తే మాత్రం అట్రాక్ట్ అవ్వాల్సిందే. అయితే బయట ఎక్కువగా వీటిని చూడలేం. జూపార్క్​లు లేదా వన్య సంరక్షణ కేంద్రాల్లో ఏనుగుల్ని చూడొచ్చు. అలాగే కొన్ని పవిత్ర పుణ్యక్షేత్రాల్లోనూ పలు సేవలకు వీటిని ఉపయోగిస్తుంటారు. దేవుళ్ల ఊరేగింపు లాంటి వాటికి వినియోగించడం చూసే ఉంటారు. అయితే అక్కడ ఇతర ఏనుగుల్లా అవి ఉండవు. దేహం నిండా అలంకరణతో స్పెషల్ అట్రాక్షన్​గా నిలుస్తాయి. అయితే ఏనుగులు ఘీంకరించడం అందరికీ తెలిసిందే. అవి డ్యాన్స్ చేయడం మాత్రం ఎప్పుడూ చూసుండరు. కానీ ఇక్కడో ఏనుగు ఏకంగా హీరోయిన్ తమన్నా పాటకు మాస్ స్టెప్పులు వేసింది. ఎలిఫెంట్ డ్యాన్స్ వీడియో చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే.

సోషల్ మీడియాలో ఇప్పుడో ఏనుగు డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఏనుగుతో పాటు దాన్ని కంట్రోల్ చేసేందుకు ఓ మావటి, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరికి వెనుక వైపు చాలా మంది అమ్మాయిలు ఉండటాన్ని గమనించొచ్చు. ఆ టైమ్​లో ఎవరో తలైవా రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో తమన్నా చేసిన ‘కావాలయ్యా’ సాంగ్​ను ప్లే చేశారు. దీంతో వెంటనే కాలు కదపడం స్టార్ట్ చేసిందా ఏనుగు. కుడి కాలును పైకి లేపి హుక్ స్టెప్ వేసింది. ఆ సమయంలో శరీరం మొత్తాన్ని ఎడమ వైపునకు బెండ్ చేసింది. కాళ్లతో పాటు తొండాన్ని కదుపుతూ తమన్నా స్టెప్స్​ను కాపీ చేసింది. ఆ తర్వాత సాంగ్ బీట్​కు తగ్గట్లు ఒక్కో కాలును పైకి లేపి, మళ్లీ కింద పెట్టి రోడ్డుకు ఇరువైపులా తిరగసాగింది.

‘కావాలయ్యా’ పాటకు ఏనుగు వేసిన మాస్ డ్యాన్స్ వీడియో నెట్టింట హల్​చల్​ చేస్తోంది. దీనికి భారీగా కామెంట్స్, లైక్స్, షేర్స్ రావడం విశేషం. ఏనుగు ఏమన్నా డ్యాన్స్ చేసిందా అని అంతా షాకవుతున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే.. అది రియల్ ఎలిఫెంట్ కాదు. అవును, అది నిజమైన ఏనుగు కాదు. కొందరు యువకులు కలసి ఏనుగులా కాస్ట్యూమ్స్​ వేసుకొని తమన్నా సాంగ్​కు డ్యాన్స్ చేశారు. సరిగ్గా గమనిస్తే వీడియో మొదట్లోనే అది తెలిసిపోతుంది. పక్కన కాలేజీ అమ్మాయిలు ఉండటం, ఏనుగు రియల్ కాదని దాని శరీరం, కదలికలను బట్టి అర్థమైపోతుంది. అలాగే వీడియో మొదట్లో ఆ ఏనుగు కింద కొందరు ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే చాలా మంది అంత డీటెయిల్డ్​గా గమనించకపోవడంతో అది రియల్ ఎలిఫెంట్ అనుకొని పొరబడుతున్నారు. మరి.. తమన్నా సాంగ్​కు ఎలిఫెంట్ మాస్ డ్యాన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అనుపమ అదిరే ఆఫర్‌.. అది తెచ్చిచ్చిన వారిని పెళ్లి చేసుకుంటుందట

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet