వీడియో: గాలివానల బీభత్సం.. కూలిన భారీ హోర్డింగు.. 35 మందికి గాయాలు

ఇన్నాళ్లు ఎండల వేడికి తట్టుకోలేకపోతున్న ప్రజలకు అకాల వర్షాలు ఉపశమనాన్ని కల్గిస్తున్నాయి. అయితే వర్షాలతో పాటు గాలి వానలు పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. బలమైన గాలుల కారణంగా భారీ హోర్డింగులు కూలిపోతున్నాయి.

ఇన్నాళ్లు ఎండల వేడికి తట్టుకోలేకపోతున్న ప్రజలకు అకాల వర్షాలు ఉపశమనాన్ని కల్గిస్తున్నాయి. అయితే వర్షాలతో పాటు గాలి వానలు పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. బలమైన గాలుల కారణంగా భారీ హోర్డింగులు కూలిపోతున్నాయి.

ఇటీవల భారీ వర్షాలు, వరదలతో దుబాయ్ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ లో కూడా వర్షాలు, వరదలు కారణంగా భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి. తాజాగా ముంబై నగరంలో గాలి వానలు బీభత్సం సృష్టించాయి. ఇన్ని రోజులుగా తీవ్రమైన ఎండతో సతమతమవుతున్న ముంబైకి అకాల వర్షంతో ఉపశమనం లభించినట్టయ్యింది. అయితే కొన్ని చోట్ల మాత్రం అకాల వర్షంతో పాటు ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. విపరీతమైన గాలి వేగానికి భవనాల మీద ఉన్న హోర్డింగులు విరిగి కింద పడ్డాయి. ఘాట్ కోపర్, మాహిమ్, దాదర్, ములుండ్, కుర్లా సహా దక్షిణ ముంబైలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి.

కొన్ని చోట్ల దుమ్ము దట్టంగా వ్యాపించింది. పలు చోట్ల చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ ని నిలిపి వేశారు. పలు మార్గాల్లో మెట్రో సేవలను నిలిపివేశారు. సబ్ అర్బన్ రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఘాట్ కోపర్ ఏరియాలో బలమైన గాలుల కారణంగా పెట్రోల్ పంప్ పై ఉన్న భారీ హోర్డింగ్ విరిగి కింద పడడంతో 35 మందికి గాయాలయ్యాయి. మరో 100 మంది హోర్డింగ్ కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్లు, గ్యాస్ కట్టర్స్ సహాయంతో హోర్డింగ్ ని తొలగించి ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్ లో గాయాలైన వారిని రాజవాడి హాస్పిటల్ కి తరలించినట్టు అధికారులు తెలిపారు.   

Show comments