వీడియో: దారుణం.. టోల్ ఫీజు అడిగినందుకు మ‌హిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు!

Driver Crashes into Woman: సాధారణంగా జాతీయ రహదారిపై టోల్ ప్లాజాలు దర్శనమిస్తుంటాయి.. అక్కడ మీరు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల టోల్ ప్లాజా వద్ద గొడవలు, కొట్లాటలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Driver Crashes into Woman: సాధారణంగా జాతీయ రహదారిపై టోల్ ప్లాజాలు దర్శనమిస్తుంటాయి.. అక్కడ మీరు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల టోల్ ప్లాజా వద్ద గొడవలు, కొట్లాటలు జరుగుతున్న విషయం తెలిసిందే.

దేశంలో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు ఉంటాయి. మీరు ఆ దారిలో ప్రయాణం చేస్తున్న సమయంలో మీరు నిర్ణీత రుసుము టోల్ ప్లాజా వద్ద చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రముఖ రాజకీయ నేతలు, అధికారులకు మాత్రం ఈ టోల్ ఫీజ్ మినహయింపు ఉంటుంది. టోల్ ప్లాజా వద్ద యంత్రాంగం, సిబ్బంది ఉంటారు. ఇటీవల కొంతమంది టోల్ ప్లాజా వద్ద ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి తప్పించుకుంటున్నారు. అంతేకాదు తాము ప్రభుత్వ సిబ్బంది అని.. ఇది ప్రభుత్వ వాహనం అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.కొన్నిసార్లు టోల్ ప్లాజా వద్ద రౌడీయిజం చేస్తూ అల్లరి చేయడం చూస్తున్నాం. ఓ వాహనదారుడు టోల్ ప్లాజా వద్ద మహిళా సిబ్బందిపై దారుణంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే..

జాతీయ రహదారులపై టోల్ ప్లాజా వద్ద కొంతమంది ఆకతాయిలు, రౌడీలు, రాజకీయ అనుచరులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. టోల్ ఫీజ్ కట్టే సమయానికి పెద్ద గొడవలు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా అలాంటి మరో ఘోరం వెలుగు చూసింది. టోల్ ఫీజ్ అడిగినందుకు ఓ వాహనదారుడు అక్కడ మహిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఢిల్లీ – మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ లేకపోవంతో డబ్బులు చెల్లించాలని సిబ్బంది వాహనదారుడిని కోరారు. దాంతో కారు డ్రైవర్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం దుర్భాషలాడుతూ వాణం ముందు నిల్చున్న మహిళపై దూసుకువెళ్లాడు. ఈ ఘటగనలో ఆ ఉద్యోగిని తీవ్రంగా గాయపడింది.

ఢిల్లీ నుంచి వచ్చిన వాహనదారుడు మా టోల్ ప్లాజా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.. అంతే కాదు టోల్ ఫీజ్ అడిగినందుకు మా మహిళా సిబ్బందిని కారుతో పాటు ఈడ్చుకు వెళ్లాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అంటూ కాశీ టోల్ ప్లాజా మేనేజర్ అనీల్ శర్మ కోరారు. ఈ షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఈ పని చేసి ఉంటాడు.. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఒక మహిళ అని కూడా చూడకుండా ఇలాంటి దారుణానికి పాల్పపడిన డ్రైవర్ లైసెన్స్ క్యాన్సల్ చేసి జైల్లో పెట్టాలి అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments