iDreamPost

Toll Charges: వాహనదారుల జేబుకు చిల్లు.. పెరిగిన టోల్ ఛార్జీలు

  • Published Apr 01, 2024 | 8:56 AMUpdated Apr 01, 2024 | 9:25 AM

ఏప్రిల్ నెల ప్రారంభంలోనే సామాన్యుల జేబుకు చిల్లు పెట్టేందుకు రెడీ అయ్యింది ప్రభుత్వం. టోల్ ఛార్జీలను పెంచింది. ఆ వివరాలు..

ఏప్రిల్ నెల ప్రారంభంలోనే సామాన్యుల జేబుకు చిల్లు పెట్టేందుకు రెడీ అయ్యింది ప్రభుత్వం. టోల్ ఛార్జీలను పెంచింది. ఆ వివరాలు..

  • Published Apr 01, 2024 | 8:56 AMUpdated Apr 01, 2024 | 9:25 AM
Toll Charges: వాహనదారుల జేబుకు చిల్లు.. పెరిగిన టోల్ ఛార్జీలు

ఏప్రిల్ 1 వచ్చిందంటే.. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. కొన్ని రంగాల్లో కొత్త నియమాలు అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పథకాల గడువు కూడా ముగుస్తుంది. ఇక ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా అనేక నియమ నిబంధనలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే అనగా ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయి. ఈసారి కూడా అలానే జరగనుంది. ఇక నెల ప్రారంభంలోనే వాహనదారుల జేబుకు భారీ ఎత్తున చిల్లు పడే నియమం ఒకటి అమల్లోకి రానుంది. అదే టోల్ ఛార్జీలు. నేటి నుంచి ఇవి పెరగనున్నాయి. ఆ వివరాలు..
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చింది. ఏడాదికి ఒకసారి.. అదికూడా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన ఏప్రిల్‌ 1న టోల్‌ రుసుం పెరుగుతుంది. రోడ్ల నిర్వహణకు ఛార్జీల పెంపును ఆనవాయితీగా తీసుకున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ).. ఈసారి కూడా టోల్ ఛార్జీలను పెంచేందుకు రెడీ అయ్యింది. గతేడాది వివిధ కేటగిరీల వాహనాలకు సంబంధించి టోల్ రుసుమును 8-15 శాతం వరకు  పెంచగా.. ఈసారి మాత్రం కాస్త దయతలిచింది. ఫలితంగా ఈ ఏడాది ఎన్‌హెచ్‌ఏఐ టోల్ ఛార్జీల పెంపును 5.50 శాతానికే పరిమితం చేసింది.
Increased toll charges
ఈపెంపు ఎంత ఉండనుంది అనేదాన్ని అర్థం చేసుకోవడానికి హైదరాబాద్‌-విజయవాడ (65) జాతీయ రహదారిని ఉదాహరణగా తీసుకుంటే.. ఈ హైవేపై తెలంగాణలో.. చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ అలానే ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. దాంతో ఈ మార్గాల్లో ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10 టోల్ ఛార్జీగా నిర్ణయించారు.
ఇక తేలికపాటి వాణిజ్య వాహనాలకైతే ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20, అదే విధంగా బస్సు, ట్రక్కులకు రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాలకు రూ.35, రూ.50 చొప్సున టోల్ ఛార్జీలను పెంచారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుంలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది. టోల్ ఛార్జీలతో పాటు స్థానికుల నెలవారీ పాస్‌ను కూడా పెంచారు. ఆ మొత్తాన్ని రూ.330-340కి పెంచారు.పెరిగిన టోల్‌ ధరలతో సామాన్యులపై భారం పడనుంది. 2025 మార్చి 31 వరకు పెరిగిన ధరలు అమలులో ఉండనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి