iDreamPost
android-app
ios-app

కుప్పకూలిన నేవీ హెలికాప్టర్.. ఒకరు మృతి

  • Published Nov 04, 2023 | 8:58 PM Updated Updated Nov 04, 2023 | 9:03 PM

కేరళాలోని కొచ్చిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం ఇండియన్ నేవీకి చెందిన చేతక్ హెలికాప్టర్ కొచ్చిలోని నావికాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ గురుడ రన్ వే పై రాగానే హఠాత్తుగా కుప్పకూలిపోయింది.

కేరళాలోని కొచ్చిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం ఇండియన్ నేవీకి చెందిన చేతక్ హెలికాప్టర్ కొచ్చిలోని నావికాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ గురుడ రన్ వే పై రాగానే హఠాత్తుగా కుప్పకూలిపోయింది.

  • Published Nov 04, 2023 | 8:58 PMUpdated Nov 04, 2023 | 9:03 PM
కుప్పకూలిన నేవీ హెలికాప్టర్.. ఒకరు మృతి

ఇటీవల విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాలు, ప్రకృతి విపత్తు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు పక్షులు ఢీ కొట్టడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రమాదాన్ని ముందుగానే గమనించి పైలెట్స్ ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులను కాపాడుతున్నారు. తాజాగా నేవీ హెలికాప్టర్ ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందారు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కేరళాలోని కొచ్చిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం ఇండియన్ నేవీకి చెందిన చేతక్ హెలికాప్టర్ కొచ్చిలోని నావికాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ గురుడ రన్ వే పై రాగానే హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సహా ఇద్దరు గాయపడ్డారు. చాపర్ రోటర్ బ్లేడు కింద తగలడం వల్ల రన్ వే పై ఉన్న నౌకాదళ అధికారి ఒకరు మృది చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సైనికులు నావికాదళ ప్రధాన కార్యాలోని సంజీవని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.

చేతక్ హెలికాప్టర్ ఘటనలో నేవీ అధికారి యోగేంద్ర సింగ్ చనిపోయినట్లు తెలుస్తుంది. సౌత్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లోని ఐఎన్ఎష్ గరుడ రన్ వే పై హెలికాప్టర్ రాగానే రోటర్ బ్లేడ్ లు తగలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కొచ్చి హార్బర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş