Krishna Kowshik
చిన్న చిన్న పనుల మీద బయటకు వెళ్లాలంటే మోటారు వాహనం సరిపోతుంది. సుదూర ప్రాంతాలకు వెళితే.. కారు తప్పనిసరి. ట్రాఫిక్ నుండి తప్పించుకునేందుకు హైవేలు మంచి ఆప్షన్. అలా హైవేలపై వెళుతున్న ప్రతిసారి కనిపిస్తుంటాయి టోల్ గేట్స్. వాహనాలను బట్టి ఛార్జ్ చేస్తుంటాయి. అయితే కొంత మందికి సరైన రూల్స్ తెలియకుండా.. వాటి గుండా ప్రయాణిస్తుంటారు. అవేంటో తెలుసుకుంటే..
చిన్న చిన్న పనుల మీద బయటకు వెళ్లాలంటే మోటారు వాహనం సరిపోతుంది. సుదూర ప్రాంతాలకు వెళితే.. కారు తప్పనిసరి. ట్రాఫిక్ నుండి తప్పించుకునేందుకు హైవేలు మంచి ఆప్షన్. అలా హైవేలపై వెళుతున్న ప్రతిసారి కనిపిస్తుంటాయి టోల్ గేట్స్. వాహనాలను బట్టి ఛార్జ్ చేస్తుంటాయి. అయితే కొంత మందికి సరైన రూల్స్ తెలియకుండా.. వాటి గుండా ప్రయాణిస్తుంటారు. అవేంటో తెలుసుకుంటే..
Krishna Kowshik
చేతిలో వాహనం ఉంది కదా రయ్ రయ్ అంటూ హైవేలపై దూసుకెళుతుంటారు ప్రయాణీకులు. వాటికి బ్రేకులు వేస్తుంటాయి టోల్ గేట్స్. ఎంత జోరుమీద ఉన్న వాహనమైనా.. టోల్ గేట్ చూడగానే.. కాస్తంత వేగం తగ్గుతుంది. అయితే టోల్ గేట్ వద్దకు రాగానే అక్కడ పేర్కొన్న వాహనాలను బట్టి ఛార్జీలు వసూలు చేస్తుంటారు. దీని కోసం కొన్ని సార్లు క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్ట్ ట్యాగ్ సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఇవే కాకుండా కొన్ని రూల్స్ తెచ్చింది. అవేమిటో తెలియకుండా.. వాటి గుండా ప్రయాణిస్తుంటారు. ఆ రూల్స్ అందరూ పాటిస్తున్నారా అని సాగతీయోద్దు. ఇవి తెలుసుకుంటే.. మీకు సమాచారం తెలియడంతో పాటు జేబుకు కాస్తంత చిల్లు పడటం తగ్గుతుంది. ఇంతకు ఆ రూల్స్ ఏంటంటే..?
హైవేలపై ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఇందులో భాగంగా మే 2021లో 10 సెకన్ల నియమాన్ని ప్రవేశపెట్టింది. అదే ఫాస్ట్ ట్యాగ్. టోల్ ప్లాజాలకు ఫాస్ట్ ట్యాగ్ ఇంటిగ్రేషన్ ఉండటంతో ఎక్కువ సేపు వేచి చూడకుండా 10 సెకన్లలో వాహనం టోల్ గేట్ దాటేసే విధంగా నియమాన్ని పొందు పరిచింది. ఇంతకీ ఆ 10 సెకన్ల నియమం ఏంటంటే..? టోల్ ప్లాజాలో రద్దీ వేళల్లో కూడా ఒక్కో వాహనం సర్వీస్ టైమ్ 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం వెచ్చించకూడదని దీన్ని తీసుకువచ్చింది. అంటే టోల్ గేట్ల వద్ద కనీస నిరీక్షణ సమయం కేవలం 10 సెకన్లేనన్నమాట. అలాగే 100 మీటర్లకు మించి క్యూలో నిలబడకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది.
దీని వల్ల ఎక్కువ సమయం వాహనాలు క్యూలో ఉండాల్సిన అవసరం ఉండదు. సులభంగా ట్రాఫిక్ నుండి బయటపడొచ్చు. ఒక వేళ.. క్యూ 100 మీటర్ల కంటే ఎక్కువ ఉండి.. టోల్ బూతు వద్దకు చేరుకునే సరికి 10 సెకన్లు దాటితే.. ఒక్క రూపాయి కూడా వాహనదారుల నుండి టోల్ వసూలు చేయకూడదు. అలాగే ప్రతి టోల్ లైనులో టోల్ బూతు నుండి 100 మీటర్ల పసపు లైన్ మార్కింగ్ ఉండాలి. హైవేలపై పెరుగుతున్న ప్రయాణాలు, ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకుండా, సజావుగా ప్రయాణం సాగేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటోంది. రాబోయే 10 సంవత్సరాల్లో ట్రాఫిక్ అంచనాలను పరిగణలోకి తీసుకుని నేషనల్ హైవేస్ అథారిటీ ఈ రూల్స్ ప్రవేశపెట్టింది.