నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగిన రామేశ్వరం కేఫ్ నెల ఆదాయం! ఊహించలేరు!

రామేశ్వరం కేఫ్ లో నిన్న జరిగిన పేలుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బెంగళూరులో అత్యంతా పాపులారిటీ పొందిన ఈ కేఫ్ నెల ఆదాయం ఎంత ఉంటుందో తెలుసా? నెలకు ఎన్ని కోట్లంటే.

రామేశ్వరం కేఫ్ లో నిన్న జరిగిన పేలుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బెంగళూరులో అత్యంతా పాపులారిటీ పొందిన ఈ కేఫ్ నెల ఆదాయం ఎంత ఉంటుందో తెలుసా? నెలకు ఎన్ని కోట్లంటే.

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిన్న(శుక్రవారం) జరిగిన పేలుడు దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించింది. అదీగాక బెంగళూరులో అత్యంత పాపులారిటీ పొందిన రామేశ్వరం కేఫ్ లో ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పథకం ప్రకారమే పేలుళ్లకు పాల్పడ్డారని తేలడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. కాగా రామేశ్వరం కేఫ్ లో లభించే ఫుడ్ ఐటమ్స్ కు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. నిత్యం వేలాది మంది ఫుడ్ లవర్స్ ఈ కేఫ్ ను సందర్శిస్తుంటారు. మరి ఈ రామేశ్వరం కేఫ్ నెల ఆదాయం ఎంతో తెలుసా? ఏడాదికి ఎన్ని కోట్లు ఉంటుందో ఊహించగలరా? ఆ వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరులో 2021లో రామేశ్వరం కేఫ్ ప్రారంభమైంది. దివ్య, రాఘవేంద్రరావు అనే జంట ఈ కేఫ్ ను  ప్రారంభించారు. అయితే వీరికి అబ్దుల్‌ కలాం అంటే ఎంతో ఇష్టం. దీంతో కలాం స్వస్థలం అయిన రామేశ్వరం పేరు మీద ఈ హోటల్ ను ప్రారంభించారు. ప్రారంభించిన అనతికాలంలోనే అత్యంత ఫేమస్ గా మారిపోయింది రామేశ్వరం కేఫ్. ఈ కేఫ్ లో లభించే ఫుడ్ ఐటమ్స్ క్వాలిటీ, క్వాంటీటి, టేస్ట్ పరంగా బాగుండడంతో ఈ కేఫ్ కు కస్టమర్ల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఫుడ్ లవర్స్ రెక్కలు కట్టుకుని ఈ కేఫ్ వద్ద వాలిపోతుంటారు. ఈ కేఫ్ లో రోజుకు దాదాపు 6,500 మంది ఫుడ్ తింటుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫుడ్ లవర్స్ ఇక్కడ లభించే ఐటెమ్స్ ను అమితంగా ఇష్టపడుతుంటారు.

వేల సంఖ్యలో కస్టమర్లు వస్తుండడంతో ఈ కేఫ్ లో నెలకు రూ. 4.5 కోట్ల ఆదాయం వస్తుంది. ఇక్కడ ఏడాదికి రూ. 50 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, బటర్ ఇడ్లీ, లెమన్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ వంటి ఐటమ్స్ ఈ కేఫ్ లో ఎంతో ఫేమస్. ఇటీవల రామేశ్వరం కేఫ్ హైదరాబాద్ లో కూడా తన బ్రాంచీని ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు కేఫ్ యజమానులు. ఇంతటి ఆదరణ ఉన్న రామేశ్వరం కేఫ్ ను టార్గెట్ చేసుకుని ఆగంతకులు పేలుళ్లకు పాల్పడ్డారు. మారణహోమం సృష్టించేందుకు పన్నాగం పన్నారు. ఈ పేలుడు ఘటనలో పలువురు గాయపడగా.. ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Show comments