వీడియో: మిచాంగ్ తుపాను ఎఫెక్ట్.. చెన్నైని ముంచెత్తుతున్న వరదలు!

Michaung Cyclone Effect In Chennai: మిచాంగ్ తుపాను కారణంగా చెన్నైలో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ కాలనీల్లో వరదనీరు చేరింది. చాలాచోట్ల వరద పరిస్థితిని తలపిస్తోంది.

Michaung Cyclone Effect In Chennai: మిచాంగ్ తుపాను కారణంగా చెన్నైలో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ కాలనీల్లో వరదనీరు చేరింది. చాలాచోట్ల వరద పరిస్థితిని తలపిస్తోంది.

చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మిచాంగ్ తుపాను ఎఫెక్ట్ వల్ల చెన్నై వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రస్తుతం నెట్టింట చెన్నై వరదలకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసిన నెటిజన్స్ చలించిపోతున్నారు. ఎందుకంటే ఆ వరదల ఎఫెక్ట్ తో కాలనీల్లోని కార్లు కొట్టుకుపోతున్నాయి. ప్రజల జీవనం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ.. చెన్నై వాసులు ఇంటి నుంచి బయటకు రావొద్దని నెటిజన్స్ సైతం హెచ్చరిస్తున్నారు.

చెన్నైని మిచాంగ్ తుపాను అతలాకుతలం చేస్తోంది. వరదనీళ్లు రోడ్ల మీదకు వచ్చేశాయి. పలు కాలనీలు జలశయాలను తలపిస్తున్నాయి. సాధారణ జీవితం స్తంభించిపోయింది. విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవులు కూడా ప్రకటించారు. ఎవరూ కూడా బయటకు రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పల్లికరానీ కాలనీలో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాలు చూసిన తర్వాత చెన్నైలో వరద తీవ్రత ఎంత ఉందో అంచనా వేయచ్చు. కార్లు అన్నీ కాగితపు పడవల్లాగా వరదనీటిలో కొట్టుకుపోతున్నాయి. మరోవైపు కురిసిన వర్షం కొంచమే అయినా వరద నీరు వెళ్లేందుకు ఆస్కారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటున్నారు.

శనివారం సాయంత్రం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటలకు కేవలం 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయితే.. చెన్నైలో వరదలు వచ్చినప్పటి పరిస్థితి కనిపించిందంటున్నారు. రోయపేట, కోడంబాక్కం, వెస్ట్ మాంబలం, చిడాద్రిపేట వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. మరోవైపు వరదలతో చెన్నైకి తాగునీరందించే రిజర్వాయర్లు అన్నీ నిండుగా కనిపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ తుపాను ఎఫెక్ట్ తో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లు మరింత నిండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షం కురవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే 2015 తరహా వరదలు వచ్చే అవకాశం లేదంటూ తమిళనాడు వెదర్ మ్యాన్ గా గుర్తింపు పొందిన ప్రదీప్ జాన్ అంచనా వేశారు. సోమవారం కూడా వర్షాల ఎఫెక్ట్ బాగానే ఉండే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు చెన్నై, తమిళనాడును దెబ్బతీస్తూనే ఉన్నాయి. అందుకే ఈ సీజన్ అంటేనే ఇక్కడి ప్రజల్లో ఆందోళన మొదలవుతోంది. ఈ తుపాను హెచ్చరికలు చూస్తుంటే.. 2015 డిసెంబర్, 2016 డిసెంబర్ లో వచ్చిన తరహా హెచ్చరికలే అంటూ అధికారులు చెబుతున్నారు.

ఇంక ఈ మిచాంగ్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇది నెల్లూరు- బందరు మధ్య తీవ్ర తుపానుగా మారి డిసెంబర్ 5న తీరం దాటుతుందని తెలియజేశారు. ఈ తుపాను ప్రభావంతో గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ తుపాను ప్రభావంతో కోస్తా ఆంధ్రాతో పాటు యానాంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని తెలిపారు. ఉత్తర కోస్తా, రాయలసీమకు కూడా భారీ వర్ష సూచన ఉందంటున్నారు. మరి.. చెన్నై వరదలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments