అమ్మాయిలని ప్రెగ్నెంట్ చేసే జాబ్.. రూ.10 వేలు రివార్డు..! సరదా పడి వెళ్తే..

ఇప్పటి వరకు ఎన్నో తరహా సైబర్ నేరాలను విని, చూసి ఉంటాం. రకరకాల రూపంలో అమాయక ప్రజలను మోసం చేస్తూ సైబర్ కేటుగాళ్లు భారీ మొత్తంలో నగదును కొల్లగొడుతున్నారు. కానీ, తాజాగా జరిగిన ఈ సైబర్ క్రైమ్ గురించి వింటే షాక్ అవుతారు. ఎందుకంటే.. అందమైన అమ్మాయిలను గర్భవతి చేస్తే రివార్డు అంటూ ప్రకటన చివరిలో ఊహించని ట్విస్ట్. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇప్పటి వరకు ఎన్నో తరహా సైబర్ నేరాలను విని, చూసి ఉంటాం. రకరకాల రూపంలో అమాయక ప్రజలను మోసం చేస్తూ సైబర్ కేటుగాళ్లు భారీ మొత్తంలో నగదును కొల్లగొడుతున్నారు. కానీ, తాజాగా జరిగిన ఈ సైబర్ క్రైమ్ గురించి వింటే షాక్ అవుతారు. ఎందుకంటే.. అందమైన అమ్మాయిలను గర్భవతి చేస్తే రివార్డు అంటూ ప్రకటన చివరిలో ఊహించని ట్విస్ట్. ఇంతకి ఏం జరిగిందంటే..

ఈ మధ్య దేశంలో సైబర్ నేరలు ఏ స్థాయిలో జరుగుతున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ఏ రూపంలలో మోసాలు చేస్తున్నారో ఊహాకు కూడా అందడం లేదు. ఎందుకంటే.. ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుంటూ మోసాలకు అమాయకపు ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. అయితే ఈ సైబర్ నేరగాళ్ల వాళలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నప్పటికి చాలామంది బాధితులు ఈ కేటుగాళ్ల ఊభిలో చిక్కుకుపోతున్నారు. ఈ క్రమంలోనే లక్షల రూపాయలు ప్రజలు నుంచి ఈ నేరగాళ్లు దోచుకుంటున్నారు. అయితే రోజు రోజుకి ఈ సైబర్ నేరాల విషయంలో జాగ్రత్త అనే మాట తప్ప, మోసపోయే ఘటనలు, మోసం చేసే ఘటనలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా సైబర్ కేటుగాళ్లు కూడా ఈ టెక్నాలజీని వినియోగించుకొని కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా మరో కొత్త సైబర్ నేరం అనేది వెలుగులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా కొందరు కేటుగాళ్లు ఈజీగా డబ్బులు సంపాదించి దొరికినంత దోచుకువాళనే ప్లాన్ చేసుకునేందుకు మరో కొత్త మార్గనికి తెర తీశారు. ఈ క్రమంలోనే అదిరిపోయే సూపర్ బంపర్.. అద్భుతమైన జాబ్ ఆఫర్ అంటూ ఓ ప్రకటన చేశారు.కాగా, ఆ ప్రకటనలో అందమైన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేయాలి, పైగా వారితో పాటు పెళ్లయి చాలా కాలమైనా సంతానం కలగని మహిళలను గర్భం దాల్చేలా చేస్తే చాలు.. రూ. 10 వేలు రివార్డు ఇస్తాం అంటూ సోషల్ మీడియా ద్వారా కొందరు కేటుగాళ్లు ఆఫర్ చేశారు. ఇక ఈ ఆఫర్ ద్వారా అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూళు చేశారు.ఇక ఈ ప్రకటన చూసిన చాలామంది అద్భుతమైన ఆఫర్ అంటూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకేముంది ఆ అమాయకుల నుంచి నేరాగాళ్లు రూ.750 ఫీజును వసూళ్లు చేవారు. ఈ క్రమంలోనే మొదలైన ఈ దోపిడి వేలు, లక్షల్లో దండుకునే వరకు వెళ్లిపోయింది.అయితే ఈ షాకింగ్ సైబర్ క్రైమ్ అనేది హర్యానాలోని నుహ్ జిల్లాలోని మేవాత్‌లో వెలుగులోకి వచ్చింది. ఇక అక్కడ మహిళలను మహిళలను గర్భవతి చేస్తే డబ్బులు ఇస్తామంటూ మోసం చేస్తున్న కొంతమంది ముఠాను పోలీసులు తాజాగా పట్టుబడ్డారు.

అయితే హర్యానాలో మేవాత్ లో ఈ నేరగాళ్లు KYC, OLX, Tatlu  వంటి వాటితో దోపిడికి పాల్పడుతూ.. విభిన్నమైన ప్రకటన చేశారు. దీంతో కొందరు మోసపోయి ఈ ప్రకటనపై ఫిర్యాదు చేశారు. కాగా, ఈ  ఫిర్యాదును అందుకున్న నూహ్ జిల్లా సైబర్ స్టేషన్ పోలీసులు ఇద్దరు మోసగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ ప్రకటన చూసి పోలీసులే అవాక్కయ్యారు. కాగా, ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లయి చాలా కాలమైనా సంతానం కలగని ఇలాంటి మహిళలను గర్భవతులను చేసేందుకు ఈ ప్రకటన చేశారు. పైగా అందులో అందమైన మహిళల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి,  వారిని  గర్భవతిని చేసిన వ్యక్తికి రూ.10 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ ఉచ్చులో పడిన యువత ప్రకటనలో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగానే సెక్యూరిటీ పేరుతో మోసగాళ్లు రూ.750 డిమాండ్ చేసేవారు.

పైగా రిజిస్ట్రేషన్ సాకు చూపి యువతను రకరకాలుగా మోసం చేసి వారి నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు. ఇలాంటి ఫిర్యాదును స్వీకరించిన నూహ్ సైబర్ పోలీస్ స్టేషన్ ఇద్దరు మోసగాళ్లను అరెస్టు చేసింది. ఇకపోతే ఈ నిందితులను పాల్వాల్‌లోని హతిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురాకా నివాసి ఇజాజ్, నుహ్ జిల్లాలోని పింగవాన్ నివాసి ఇర్షాద్‌గా గుర్తించారు. అలాగే నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇందులో రెండు సిమ్ కార్డులు మహారాష్ట్ర నుంచి, రెండు అసోం చిరునామా నుంచి కొనుగోలు చేశారు. అలాగే వీరికి నాలుగుకు పైగా ఫేస్‌బుక్ ఖాతాలను కూడా పోలీసులు గుర్తించారు. మరి ఈ తరహా సైబర్ నేరం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments