P Venkatesh
ఆకలి తీర్చుకుందామని ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడితే కస్టమర్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. స్విగ్గీ డెలివరీ చేసిన ఫుడ్ లో జలగను చూసి షాకైన కస్టమర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆకలి తీర్చుకుందామని ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడితే కస్టమర్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. స్విగ్గీ డెలివరీ చేసిన ఫుడ్ లో జలగను చూసి షాకైన కస్టమర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
P Venkatesh
ప్రస్తుత కాలంలో అంతా ఉరుకుల పరుగుల జీవన విధానం కొనసాగుతోంది. ఇంట్లో వంట చేసుకునే సమయం లేక అంతా ఆన్ లైన్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు. కూర్చున్న చోటుకే ఫుడ్ వస్తుండడంతో ఆన్ లైన్ లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఒకప్పుడు మనం ఏదైనా తినాలి అనుకుంటే.. రెస్టారెంట్స్ కి, హోటల్స్ కి వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు క్షణాల్లో.. మనకి ఇష్టమైన ఫుడ్ మన ఎదురుగా ఉంటుంది. ఈ క్రమంలోనే అటు ఇంట్లో నుంచి ఆఫీసు వరకు ఎక్కడైనా, ఎప్పుడైనా నిమిషాల వ్యవధిలో.. మనం కోరుకునే ఫుడ్ తో మన ఆకలిని తీర్చుకోవచ్చు. ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ మంది భోజన ప్రియులు ఉండటంతో.. ఈ ఆన్ లైన్ ఫుడ్ యాప్ లకు గిరాకి పెరిగిపోయింది. అయితే తాజాగా ఓ వ్యక్తి ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. ఇక ఆ ఫుడ్ ని ఓపెన్ చేసి చూడాగా ఒక్కసారి షాక్ గురయ్యాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
దేశంలో అనేక రకాల ఆన్‌లైన్ ఫుడ్ కంపెనీలు నడుస్తున్నాయి. ఇలా మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్ పెడితే.. తక్షణమే తమ ఆకలిని తీర్చే విధంగా కావాల్సిన ఆహారాన్ని పొందుతున్నారు. అయితే కొన్ని సందర్భల్లో ఈ ఫుడ్ కంపెనీల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్స్ చాలా సార్లు మోసపోతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తరుచుగా మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. తాజాగా ఓ వ్యక్తి షేర్ చేసిన షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిదంటే.. బెంగళూరులో నివసిస్తున్న ఓ వ్యక్తి ఆన్‌లైన్ ఫుడ్ కంపెనీ అయిన స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. అతను ఆర్డర్ పెట్టిన ఆహారం అతని వద్దకు చేరింది. ఆకలి మీద ఉన్న అతను ఆ ఫుడ్ ప్యాకెట్ ను తెరిచినప్పుడు.. లోపల కదులుతు ఉన్న నత్త దర్శనమిచ్చింది. దాన్ని చూసిన అతను షాక్ గురయ్యాడు. వెంటనే తన మొబైల్ లో నత్త ఉన్న ఆ ఫుడ్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. క్షణాల్లో ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఇప్పుడు ఈ వీడియోను ధవల్ సింగ్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో @Dhavalsingh7 IDతో షేర్ చేశాడు. ఆ వీడియోను స్విగ్గీకి ట్యాగ్ చేసి.. ..”తాను ఇక లియోన్స్ గ్రిల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయనని.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరికీ జరగకుండా చూసుకోవడానికి @SwiggyCares ఏమైనా చర్యలు చూస్తుందా అని రాసుకొస్తూ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ఆహారం మీద పాకుతున్న నత్తను చూడవచ్చు. మరి, ఆన్ లైన్ ఫుడ్ లో ఆ వ్యక్తికి ఎదురైనా సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Never ordering from @LeonGrill ever again!@SwiggyCares do whatever you can to ensure this shit doesn’t happen to others…
Blr folks take note
Ughhhhh pic.twitter.com/iz9aCsJiW9— Dhaval singh (@Dhavalsingh7) December 15, 2023