iDreamPost
android-app
ios-app

ZOMATO నుంచి క్రేజీ యాప్.. ఇక మూవీస్, స్పోర్ట్స్ కూడా..!

  • Published Nov 25, 2024 | 2:56 PM Updated Updated Nov 25, 2024 | 2:56 PM

Zomato: జొమాటో ఇప్పటికే ఆన్ లైన్ ఫుడ్ డెలివరి ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు మరో యాప్ ని తీసుకొస్తుంది.

Zomato: జొమాటో ఇప్పటికే ఆన్ లైన్ ఫుడ్ డెలివరి ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు మరో యాప్ ని తీసుకొస్తుంది.

ZOMATO నుంచి క్రేజీ యాప్.. ఇక మూవీస్, స్పోర్ట్స్ కూడా..!

ఫేమస్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన కొత్త ‘డిస్ట్రిక్ట్’ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త యాప్ తో జోమాటో తన వ్యాపారాన్ని ఇంకా విస్తరించుకోవాలని చూస్తుంది. అందుకే కొత్త యాప్ ని ప్రవేశ పెట్టింది. అసలు ఈ యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇక ఈ యాప్ లో ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధించిన సేవలు పొందవచ్చు. ఈ యాప్ లో సినిమా టికెట్ బుకింగ్, ఈవెంట్ బుకింగ్ తో పాటు ముందుగానే రెస్టారెంట్లలో టేబుల్ బుకింగ్ ఉన్నాయి. యూజర్లు సినిమాలు, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్, షాపింగ్‌ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి.. డైనింగ్, షాపింగ్ వంటి వాటికోసం ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒకే యాప్‌లో అన్ని సౌకర్యాలు పొందవచ్చు. జోమాటో కంపెనీ Paytm ఈవెంట్‌లు, టికెటింగ్ వ్యాపారాన్ని ఆగస్టు 2023లో రూ. 2,048 కోట్లకు కొనుగోలు చేసింది. అందువల్ల ఈ రంగంలో కూడా తన ప్లేస్ ని గట్టిగా ఫిక్స్ చేసుకునేందుకు రెఢీ అయింది.డిస్ట్రిక్ట్ యాప్‌ను తీసుకురానున్నట్లు గతంలోనే సిఈఓ దీపీందర్ గోయల్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే ప్రస్తుతానికి ఈ యాప్ యాపిల్ ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది.

ఫుడ్ డెలివరీలో దూసుకెళ్తున్న జొమాటో.. టికెటింగ్ వ్యాపారంలో కూడా ముందుకు సాగడానికి పేటీఎం నుంచి టికెటింగ్ బిజినెస్ ని కొనేసింది. ఈ డిస్ట్రిక్ట్ యాప్ ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకొనే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీతో పాటు ఇప్పటికే కిరాణా సరుకుల డెలివరీ కూడా స్టార్ట్ చేసి మంచి జోరుమీదుంది జోమాటో. ఇప్పుడు ఈ Zomato డిస్ట్రిక్ట్ యాప్ సహాయంతో వివిధ సినిమా హాళ్లలో సినిమాల టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అలాగే కచేరీలు, నాటకాలు, ఇతర లైవ్‌ షోల కోసం టికెట్స్ బుకింగ్‌ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ ద్వారా రెస్టారెంట్‌లలో టేబుల్స్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ యాప్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.