P Venkatesh
ఢిల్లీ వీధుల్లో ఓ జంట స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ డ్రెస్‌లు ధరించి బైక్ షికారుకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ వీడియోలు వాయువ్య ఢిల్లీలోని ద్వారాక ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చాయి.
ఢిల్లీ వీధుల్లో ఓ జంట స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ డ్రెస్‌లు ధరించి బైక్ షికారుకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ వీడియోలు వాయువ్య ఢిల్లీలోని ద్వారాక ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చాయి.
P Venkatesh
సోషల్ మీడియా పుణ్యమాని రోజుకో వింతని చూడాల్సి వస్తుంది. వ్యూస్ కోసం రకరకాల స్టంట్ లు చేస్తూ జనాలను ఇబ్బందులు పెడుతూ వారు కూడా ఇబ్బందుల్లో పడుతున్నారు. సోషల్ మీడియాలో త్వరగా పాపులర్ అయ్యేందుకు నడిరోడ్లపై డ్యాన్స్ లు చేస్తూ, వెరైటీ విన్యాసాలు చేస్తూ ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు. లైకులు, కామెంట్ల కోసం రీల్స్ మోజులో పడి కొన్ని సార్లు ప్రాణాలమీదికి తెచ్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక లవ్ బర్డ్స్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రేమికులు బైక్ పై రైడ్ చేస్తూ ముద్దులు, హగ్గులతో విహరించిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ జంట ఏకంగా స్పైడర్ మ్యాన్ గెటప్పుల్లో బైక్ పై షికారుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రేమ పక్షులు చేసే విన్యాసాలు అన్నీఇన్నీ కావు. బహిరంగంగానే బైక్ లపై ముద్దులతో రెచ్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుందనే సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. రోడ్లపై వాహనదారులకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఢిల్లీ వీధుల్లో ఓ జంట స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ డ్రెస్‌లు ధరించి బైక్ షికారుకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరడంతో వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని భారీగా ఫైన్ విధించారు.
నజాఫ్‌గడ్‌కు చెందిన ఆదిత్య వర్మ ఓ యువతితో కలిసి స్పైడర్ మ్యాన్ డ్రెస్సుల్లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు బైక్ రైడింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా ఉండాలని స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్‌లా డ్రెస్ వేసుకొని బైక్‌పై ఢిల్లీ వీధుల్లో షికారు కొట్టారు. వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ నానా హంగామా చేశారు. సెల్ఫీలు, వీడియోలు తీస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు వాయువ్య ఢిల్లీలోని ద్వారాక ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చాయి. జంటను అదుపులోకి తీసుకున్నారు. ఎంవీఐ యాక్ట్ కింద జరిమానా విధించి వదిలేశారు. నంబర్ ప్లేట్‌లేని బైక్ నడపడంతో పాటు హెల్మెట్ ధరించకపోవడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చలాన్లు జారీ చేశారు.
Spiderman Couple”
Reel On Motorcycle #SpiderMan #Delhi pic.twitter.com/WIaihOz8iF— Pankaj Upadhyay (@pankaju17) April 26, 2024