ఈ శుభలేఖకి పెట్టే ఖర్చుతో రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు.. ఎన్ని లక్షలో తెలుసా?

Wedding Card: ప్రతి పెళ్ళికి వెడ్డింగ్ కార్డ్ అనేది చాలా ముఖ్యం. కానీ ఓ వెడ్డింగ్ కార్డ్ ఏకంగా లక్షలు పలుకుతుంది.

Wedding Card: ప్రతి పెళ్ళికి వెడ్డింగ్ కార్డ్ అనేది చాలా ముఖ్యం. కానీ ఓ వెడ్డింగ్ కార్డ్ ఏకంగా లక్షలు పలుకుతుంది.

పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. అందుకే ఎప్పటికీ గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. కొందరు తమ స్థోమతకు మించి కూడా పెళ్ళిని ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం అప్పులు కూడా చేస్తుంటారు. ఎందుకంటే భారతీయులకు పెళ్లి అంటే ఓ ఎమోషన్. పెళ్లి పత్రిక నుంచే మ్యారేజ్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. పసుపు రాసి పత్రిక చేతికి ఇచ్చి పెళ్లికి రమ్మని ఆహ్వానించడం మన దేశంలో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. పెళ్లి పత్రికలను చాలా మంది తమ అభిరుచులకు తగ్గట్లుగా డిజైన్ చేసుకుంటూ ఉంటారు. వాటిని బంధుమిత్రులకు పంచుతుంటారు. వెడ్డింగ్ కార్డ్స్‌లో ఎన్నో రకాల డిజైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఎందుకంటే ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతోంది. పెళ్లి పత్రిక చాలా స్పెషల్ గా ఉండాలని కోరుకునేవారు ఎక్కువవుతున్నారు. ఇప్పుడు ఇది ఖరీదైన హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వెడ్డింగ్ కార్డ్స్ ట్రెండ్ ఒక రేంజిలో పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అత్యంత ఖరీదైన పెళ్లి పత్రికలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. వాటి ధరలు తెలిస్తే వామ్మో అంటారు. ఇక వాటిని ఎక్కడ తయారు చేస్తారు ? వాటి స్పెషాలిటీ ఏంటి ? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వెడ్డింగ్ కార్డ్స్ స్పెషల్‌గా ఉండాలని కోరుకోవడం కామన్. కానీ ఆ వెడ్డింగ్ కార్డ్స్ వైరల్ అయ్యేలా కోరుకోవడం వెరీ రేర్. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌, ఫిరోజాబాద్‌లోని ఓ కంపెనీ అలాంటి వారికోసం చాలా డిఫరెంట్ గా పెళ్లి పత్రికలు తయారు చేస్తోంది. ఏకంగా మేలిమి బంగారం, వెండిపూతతో వెడ్డింగ్ కార్డ్స్ అచ్చు వేస్తోంది. అయితే గోల్డ్, సిల్వర్ వెడ్డింగ్ కార్డ్స్ కావాలనుకుంటే జేబుకు భారీ చిల్లు తప్పదు. ఈ స్పెషల్ వెడ్డింగ్ కార్డ్స్ కోసం మనం భారీ ధర చెల్లించాల్సిందే. వీటిని యూపీలోని లక్కీ జిందాల్ అనే వ్యాపారి డిజైన్ చేస్తున్నాడు. ఆయన వీటికి ఏకంగా రూ.10 వేల నుంచి రూ.11 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నాడు. కస్టమర్లు తమకు నచ్చిన డిజైన్స్, బడ్జెట్‌ను బట్టి వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్ చేయించుకోవచ్చని ఆయన అంటున్నారు.

ఇక పోతే వీళ్ళు ప్రతి పెళ్లి పత్రికను స్పెషల్ గా డిజైన్ చేస్తారట. వీటి తయారీకి చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ప్యూర్ గోల్డ్, సిల్వర్ తో వీటిని డిజైన్ చేస్తారట. ఈ వెడ్డింగ్ కార్డ్స్‌కు తక్కువ సమయంలోనే భారీ ఆదరణ దక్కిందని లక్కీ జిందాల్ తెలిపారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో ఆర్డర్లు బాగా పెరిగాయట. చాలా మంది కూడా తమ అభిరుచి, ఇష్టాఇష్టాలు, స్టైల్‌కు అనుగుణంగా వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్ చేయించుకుంటున్నారని లక్కీ జిందాల్ తెలిపారు. అయితే ఈ వెడ్డింగ్ కార్డ్స్ ధరలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వామ్మో.. ఇంత కాస్ట్లీ వెడ్డింగ్ కార్డ్స్ కొనేవారు కూడా ఉంటారా? పెళ్లి పత్రిక కోసం ఇన్ని లక్షలు ఖర్చు చేయడం అవసరమా? ఆ డబ్బుతో ఏకంగా రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ సంగతి. మరీ లక్షలు ఖరీదు చేసే ఈ కాస్ట్లీ వెడ్డింగ్ కార్డ్స్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments