Dharani
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించింది. కారణమిదే
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించింది. కారణమిదే
Dharani
కరోనా వచ్చాక ఓటీటీల హవా పెరిగింది. ప్రస్తుతం వీటి క్రేజ్ ఎలా ఉందంటే.. ఒకప్పుడు కొత్త సినిమాలు చూడాలంటే థియేటర్లకు పరిగెత్తాలి. మరి ఇప్పుడు.. హాయిగా ఇంట్లో కూర్చునే ఓటీటీల్లో చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఈమధ్య కాలంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. ఇక థియేటర్‌లోకి వచ్చిన ప్రతి కొత్త సినిమా కూడా కచ్చితంగా ఓటీటీలోకి రావాల్సిందే. వీటి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. టాప్ హీరో, హీరోయిన్లు సైతం ఓటీటీలో ప్రసారం అయ్యే వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వెంకటేష్, రానా, నాగచైతన్య, ప్రియమణి, సమంత వంటి వారు ఓటీటీల్లో సైతం రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇక చిన్న సినిమాలకు, కొత్త టాలెంట్‌కి ఓటీటీ చక్కని వేదికగా మారింది.
అయితే ఓటీటీల వల్ల ప్రేక్షకులకు, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ నష్టాన్నే కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీ కంటెంట్లలో ఎక్కువగా అసభ్య, అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. దీనికంటూ ప్రత్యేకంగా సెన్సార్ లేకపోవడంతో.. అశ్లీలత విచ్చలవిడిగా ప్రసారం అవుతోంది. ఓటీటీల్లో వచ్చే అసభ్య, అశ్లీల కంటెంట్ గురించి ఎప్పటి నుంచో ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అసభ్య కంటెంట్ ఉన్న 18 ఓటీటీలపై నిషేధం విధించింది. ఆ వివరాలు..
ఇక కేంద్రం నిషేదం విధించిన 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు.. అశ్లీల కంటెంట్‌ను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నందుకు గాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెళ్లడించింది. ఈమేరకు కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను బ్లాక్ చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆయా వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా వేదికలు ప్రసారం చేస్తోన్న అశ్లీల కంటెంట్ గురించి కేంద్ర ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తోంది. అయినా స్పందించకపోవడంతో.. వాటిని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
సదరు వెబ్‌సైట్‌లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రెండు రోజుల క్రితం అనగా మార్చి 12న ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. సంబంధిత శాఖ అధికారులతో పాటు మహిళా హక్కుల నిపుణులను సంప్రదించిన తరవాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నిషేధం విధించిన వాటిల్లో 10 యాప్స్‌ని వెంటనే బ్లాక్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టం చేసింది. ఈ పదింటిలో 7 యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉండగా.. మరో 3 యాప్‌స్టోర్‌లో ఉన్నాయి.
ఇక కేంద్రం నిషేధం విధించిన 18 ఓటీటీల్లో.. డ్రీమ్స్ ఫిల్మ్స్, వూవీ, యస్మా, అన్‌కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, హంటర్, ర్యాబిట్, హంటర్, ఎక్స్‌ట్రా మూడ్, న్యూఫ్లిక్స్, బేషారమ్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, మూడ్ ఎక్స్, మోజ్‌ఫ్లిక్స్, హాట్ షాట్ వీఐపీ, ఫ్యూగీ, చికోఫ్లిక్స్, ప్రైమ్ ప్లే ఈ ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ ప్రచారం అవుతోందని పేర్కొంది. అత్యంత అసభ్యకరంగా చిత్రీకరించిన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని తెలిపింది.