iDreamPost
android-app
ios-app

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 730 రోజులు చైల్డ్ కేర్ లీవ్ లు

  • Author Soma Sekhar Published - 05:31 PM, Wed - 9 August 23
  • Author Soma Sekhar Published - 05:31 PM, Wed - 9 August 23
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 730 రోజులు చైల్డ్ కేర్ లీవ్ లు

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడే వీలు కూడా ఉండటం లేదు. ఇక ఉద్యోగస్తుల సంగతి సరేసరి. అందులోనూ మహిళా ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రసవం తర్వాత ఓవైపు పిల్లలను, మరోవైపు ఉద్యోగాన్ని చూసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆరో వేతన సంఘం సిఫార్స్ మేరకు మహిళలు, ఒంటరి పురుషు ఉద్యోగులకు 730 రోజుల చైల్డ్ కేర్ లీవులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

చైల్డ్ కేర్ లీవులపై కేంద్ర కీలక ప్రకటన చేసింది. కేంద్ర వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు పార్లమెంట్ లో బుధవారం కీలక ప్రకటన చేశారు. సివిల్ సర్వీసెస్, ఇతర విభాగాల్లో నియమితులు అయిన కేంద్ర ప్రభుత్వ మహిళా, ఒంటరి పురుష ఉద్యోగులకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్(లీవ్) రూల్స్, 1972 లోని 43-C ప్రకారం చైల్డ్ కేర్ లీవ్(CCL)కి అర్హులు. ఉద్యోగుల మెుదటి ఇద్దరు పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చే వరకు వారి సంరక్షణకు మెుత్తం సేవలో గరిష్టంగా 730 రోజులు సెలవులు తీసుకోవచ్చు అని, దివ్యాంగులైన పిల్లల విషయంలో వయోపరిమితి లేదు అని లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు మంత్రి జితేంద్ర సింగ్.

అయితే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. కాగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా రాష్ట్రాలను బట్టి నిబంధనలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో 90 రోజులు, ఏపీలో 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ అమల్లో ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం చైల్డ్ కేర్ లీవ్ లపై తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ‘ఇంద్ర’ సీన్ రిపీట్.. నగలతో ఉడాయించిన హిజ్రా! అసలు కథ ఏంటంటే?