గుడ్ న్యూస్.. వందేభారత్ స్లీపర్ రైలు వచ్చేస్తోంది.. పట్టాలెక్కేది అప్పుడే

Vande Bharat Sleeper Train: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు వందే భారత్ చైర్ కార్ సర్వీసులు అందుబాటులోకి రాగా త్వరలో వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కబోతున్నది. ఇంతకీ ఎప్పుడంటే?

Vande Bharat Sleeper Train: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు వందే భారత్ చైర్ కార్ సర్వీసులు అందుబాటులోకి రాగా త్వరలో వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కబోతున్నది. ఇంతకీ ఎప్పుడంటే?

భారతీయ రైల్వేలో సంస్కరణలకు తెరలేపిన కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకొచ్చింది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయి. 50కి పైగా వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వందే భారత్ రైళ్ల ద్వారా తక్కువ సమయంలోనే గమ్య స్థానలకు చేరుతుండడంతో ప్రయాణికుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్లలో చైర్స్ మాత్రమే ఉన్నాయి. ప్రయాణికులు పడుకుని ప్రయాణం చేసే వీలు లేదు. ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారికి ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ లోటును తీర్చేందుకు కేంద్రం వందే భారత్ స్లీపర్ రైలును తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నది.

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలోనే వందే భారత్ స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు రెడీ అవుతున్నది. వందే భారత్ స్లీపర్ రైలును పట్టాలెక్కించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15నాటికి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు రైల్వే వర్గాల నుంచి సమాచారం. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్ రైలును ఢిల్లీ, ముంబయి మార్గంలో నడపాలని భావిస్తున్నారు. బెంగుళూరులో ఈ రైలు తయారీ తుది దశకు చేరుకుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ముంబై-ఢిల్లీ రూట్లలో వందే భారత్ స్లీపర్ ను అందుబాటులోకి తీసుకొస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు ఢిల్లీ నుంచి భోపాల్‌, సూరత్‌ మీదుగా ముంబయికి ప్రయాణిస్తుందని వెల్లడించారు. వందే భారత్ స్లీపర్ లో మొత్తం 16 కోచ్ లు ఉండనుండగా వాటిల్లో థర్డ్ ఏసీ 10, సెకండ్ ఏసీ 4, ఫస్ట్ ఏసీ ఒక బోగీ ఉంటాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. సీటింగ్‌తో పాటు లగేజీ కోసం రెండు బోగీలు అదనంగా ఉంటాయి. గంటకు 130 కి.మీ. వేగంతో నడిచే ఈ రైలు వేగాన్ని క్రమంగా 160-220 కి.మీ.లకు పెంచనున్నారు. మరి తొలి వందే భారత్ స్లీపర్ త్వరలోనే పట్టాలెక్కనుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments