Cemetery Movie Screening: అరె ఏంట్రా ఇది: శ్మశానంలో సినిమా షోలు..అసలు కారణం ఇదే!

అరె ఏంట్రా ఇది: శ్మశానంలో సినిమా షోలు..అసలు కారణం ఇదే!

Cemetery Movie Screening: శ్మశానం.. ఉదయం పూట వెళ్లటమే కష్టం.. ఇక రాత్రులు అయితే భయం.. అలాంటి శ్మశానంలో రాత్రి సమయాల్లో సినిమా షోలు వేశారు. అంతేకాక స్నాక్స్, కూల్ డ్రింక్స్ కూడా పెడుతున్నారు.

Cemetery Movie Screening: శ్మశానం.. ఉదయం పూట వెళ్లటమే కష్టం.. ఇక రాత్రులు అయితే భయం.. అలాంటి శ్మశానంలో రాత్రి సమయాల్లో సినిమా షోలు వేశారు. అంతేకాక స్నాక్స్, కూల్ డ్రింక్స్ కూడా పెడుతున్నారు.

జనాలను ఎంటర్ టైన్ చేసే వాటిల్లో సినిమాలు ఒకటి. అందుకే చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. కుటుంబ సమేతంగా వెళ్లి.. సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇది ఇలా ఉంటే..ఎవరైనా శ్మశానంలో సినిమా షోలు వేస్తారా?. ఇదే ప్రశ్న అని మీరు అడగవచ్చు. కానీ నిజంగా ఓ ప్రాంతంలోని శ్మశానంలో సినిమా షోలు వేస్తున్నారు. అంతేకాక స్నాక్స్, కూల్ డ్రింక్స్ కూడా పెడుతున్నారు. ఇంత విచిత్రంగా ఉన్న వ్యక్తులు ఎవరు, ఎక్కడ, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం… థాయ్ లాండ్ లోని శ్మశానంలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. రాత్రి పూట శ్మశానంలో సినిమా పాటలు, సినీ ఫైట్ లతో దద్దిరిల్లిపోతుంది. అక్కడ ఎవరు మూవీ చూస్తారు, ఎందుకు… అక్కడ సినిమా ఈవెంట్​ను వారం రోజులు నిర్వహించారని అనే సందేహం రావచ్చు. అయితే అక్కడ సినిమా షోలు వేసేది.. చనిపోయిన తమవారి కోసం అంట. చనిపోయిన తమ వారి ఆత్మలు ఎంజాయ్ చేసేందుకు షోలు ప్రదర్శించారట.  ఇలా ఆత్మల కోసం వేసే మూవీలను స్పూకీ అంటారని ఇంటర్ నెట్ ద్వారా తెలుస్తోంది.

థాయ్​ లాండ్​ లో స్పూకీ ఈవెంట్​ మృతుల ఆత్మలకు ఫుల్ జోష్, ఎంజాయ్ మెంట్ ను అందిస్తుందంట. చనిపోయిన తమవారి స్మారకార్ధం, వారి ఆత్మల ఎంటర్ టైన్ మెంట్ కోసం ఇలా సినీ షోలు నిర్వహించినట్లు అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు.  ఈశాన్య థాయ్‌లాండ్‌లోని నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్‌లోని ఓ శ్మశాన వాటికలో దాదాపు 3 వేల ఖాళీ కుర్చీలు వేసి.. చనిపోయిన తమ వారికోసం సినిమా షోలు వేశారు. సినిమా హాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కుర్చీలు వేశారు. ఈ ఓపెన్​ఎయిర్​ షోలో నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి అర్దరాత్రి వరకు సినిమా షోలు ప్రదర్శించారు.

కేవలం సినిమాలే కాకుండా చనిపోయిన వారికి  ఆహారం, విందు, వాహనాలు, దుస్తులు వంటివి అక్కడ పెట్టేవారట.  స్కామ్ నివేదించిన ప్రకారం..థాయిలాండ్‌లోని చైనీస్ కమ్యూనిటీ వారు మరణించిన వారి కోరికలు నెరవేరకపోతే, ఆత్మలుగా మారతాయని వారు బలంగా నమ్ముతారు. అందుకే ఇలా సినిమాల షోలు వేసి..వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని వారు చెబుతున్నారు. మొత్తం శ్మశానంలో సినిమాలు ప్రదర్శించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విచిత్ర ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments