Arjun Suravaram
Brijbhushan Singh: మహిళ రెజర్లపై లైంగిక వేధింపులు కారణంగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఆయన మరోసారి కూడా వార్తల్లోకి నిలిచారు. అయితే ఈ సారి తన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కారణంగా వార్తల్లోకి ఎక్కాడు.
Brijbhushan Singh: మహిళ రెజర్లపై లైంగిక వేధింపులు కారణంగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఆయన మరోసారి కూడా వార్తల్లోకి నిలిచారు. అయితే ఈ సారి తన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కారణంగా వార్తల్లోకి ఎక్కాడు.
Arjun Suravaram
కొన్ని నెలల క్రితం రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ చుట్టు అనేక వివాదాలు నడిచాయి. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 2024 లోక్ సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ టికెట్ నిరాకరించి.. ఆయన స్థానంలో కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ సీటు కేటాయించింది. అతడు ఉత్తర్ ప్రదేశ్ లోని కైసర్ గంజ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ లోక్ సభ ఎన్నికల వేళ బ్రిజ్‌భూషణ్‌సింగ్‌కు కొత్త చిక్కులు వచ్చాయి. బుధవారం ఆయన కుమారుడి కారు కాన్వాయ్ భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహిళ రెజర్లపై లైంగిక వేధింపులు కారణంగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఆయన మరోసారి కూడా వార్తల్లోకి నిలిచారు. అయితే ఈ సారి తన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కారణంగా వార్తల్లోకి ఎక్కాడు. కరణ్ భూషణ్ సింగ్.. ప్రయాణిస్తున్న కాన్వాయ్ గోండ నగర సమీపంలో ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. అతివేగం, నిర్లక్ష్యంగా ఆయన కారు ఇద్దరు యువకులు బైక ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరు అక్కడిక్కకడే దుర్మరణం చెందారు. దీంతో కరణ్ భూషణ్ సింగ్‌పై బాధిత కుటుంబానికి చెందిన చందా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కైసర్‌గంజ్ నియోజకవర్గంలో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20 వ తేదీన ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సంఘటన వెలుగుచూడటం తీవ్ర సంచలనంగా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హుజూర్‌పూర్-బహ్రైచ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో గోండా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకంది. కరణ్ భూషణ్ సింగ్ చెందిన కాన్వాయ్‌లోని టయోటా ఫార్చ్యూనర్ కారు బుధవారం ఉదయం 9 గంటల సమయంలో అతి వేగంతో వెళ్తూ ఇద్దరు యువకులు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న రెహాన్(17), షెహజాద్(24) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అలానే ఈ ప్రమాదంలో 65 ఏళ్ల వృద్ధురాలితో సహా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కరణ్ కారు ఢీకొట్టిన ధాటికి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ కన్వాయిలో కరణ్ భూషణ్ సింగ్ ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపారు. కానీ ఈ ప్రమాద ఘటనలో కరణ్ కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. మొత్తంగా మరోసారి బ్రిజ్ భూషణ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు.
BREAKING: Two killed as a car in Brijbhushan Singh’s son Karan Bhushan’s convoy runs over a motorcycle in Gonda.
Two deaths confirmed, one grievously injured and hospitalised. pic.twitter.com/50K3CWcdi6
— Prashant Kumar (@scribe_prashant) May 29, 2024