P Krishna
Gujarat Teen Issue: చదువు అంటే ఆ బాలికకు ఎంతో ఇష్టం.. చిన్నప్పటి నుంచి అన్ని తరగతుల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇటీవల 10వ తరగతి లో ఏకంగా 99% మార్కులు సాధించింది.. కానీ..
Gujarat Teen Issue: చదువు అంటే ఆ బాలికకు ఎంతో ఇష్టం.. చిన్నప్పటి నుంచి అన్ని తరగతుల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇటీవల 10వ తరగతి లో ఏకంగా 99% మార్కులు సాధించింది.. కానీ..
P Krishna
నేటి పోటీ సమాజంలో గొప్ప చదువులు చదివితే గొప్ప ఉద్యోగాలు వస్తాయి.. మంచి పొజీషన్లో ఉండవొచ్చు. అందుకోసం తమ తాహతకు మించినప్పటికీ ఎన్ని కష్టాలు పడైనా సరే తమ పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివిస్తుంటారు. తల్లిదండ్రులు కన్న కలలు నెరవేర్చేందుకు పిల్లలు కష్టపడి మంచి ర్యాంకులు సంపాదిస్తుంటారు. ఓ బాలిక ఇటీవల 10వ తరగతిలో 99 శాతం మార్కులు సాధించింది.. కానీ విధి ఆ బాలిక జీవితంతో ఆడుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్ సెకండరీ, హయ్యార్ సెకండరీ ఎడ్యూకేషన్ బోర్డ్ (జీఎస్‌ఈబీ) మే 11 న ఫలితాలను రిలీజ్ చేసింది. టెన్త్ లో హీర్ (16) 99% మార్కులు సాధించింది. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో విధి వెక్కిరించింది. బ్రెయిన్ డెడ్ కారణంగా హీర్ అనే బాలిక కన్నుమూసింది. ఆమె మెదడులో రక్త స్రావం కావడంతో ఒక నెల క్రితం రాజ్కోట్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకుంది. కొద్ది రోజుల తర్వా డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయింది.
గత వారం రోజు క్రితం ఆ బాలిక శ్వాస, గుండె సమస్యలతో ఇబ్బంది పడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆ బాలికను హాస్పిటల్ కి తరలించి ఐసీయూలో చేర్పించారు. ఎంఆర్ఐ నివేదికలో ఆ బాలిక మెదడు లో 80 నుంచి 90 శాతం పనిచేయడం లేదని తేలింది. ఆమె గుండె పనిచేయడం ఆగిపోవడంతో బుధవారం హీర్ మరణించింది. తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమె కళ్లను, ఆమె శరీరాన్నిదానం చేశారు. ఈ సందర్భంగా హీర్ తండ్రి మాట్లాడుతూ.. తన కూతురు డాక్టర్ కవావాలనుకుంది.. ఆమె డాక్టర్ కాకపోయినా.. ఇతరుల ప్రాణాలు ఈ విధంగా కాపాడటానికి మేం తన శరీరాన్ని దానం చేశాం ’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.