iDreamPost
android-app
ios-app

Floods: వరదల ఎఫెక్ట్.. ఇంటి కప్పుపై ముసలి! వీడియో వైరల్

  • Published Aug 29, 2024 | 12:26 PM Updated Updated Aug 29, 2024 | 12:26 PM

Crocodile Lands Roof House: దేశ వ్యాప్తంగా రుతు పవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి.. దీని ప్రభావంతో దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మనుషులే కాదు పశు పక్షాదులు సైతం నరక యాతన అనుభవిస్తున్నాయి.

Crocodile Lands Roof House: దేశ వ్యాప్తంగా రుతు పవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి.. దీని ప్రభావంతో దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మనుషులే కాదు పశు పక్షాదులు సైతం నరక యాతన అనుభవిస్తున్నాయి.

  • Published Aug 29, 2024 | 12:26 PMUpdated Aug 29, 2024 | 12:26 PM
Floods: వరదల ఎఫెక్ట్.. ఇంటి కప్పుపై ముసలి! వీడియో వైరల్

ప్రస్తుతం గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. జలాశయాలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.భారీ వర్షాలతో వరదలు పోటెత్తడంతో 28 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ ప్రాంతాలపై వర్ష ప్రభావం తీవ్రంగా చూపిస్తుందని అధికారులు అంటున్నారు. వరోదరలో 10 నుంచి 12 అడుగుల మేర నిరు నిలిచిపోయిందని.. చాలా వరకు ఇండ్లు నీటిలో మునిగిపోయాయని అధికారులు అంటున్నారు. వరదల కారణంగా పశువులు, పక్షులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వరద నీటికి కొన్ని ప్రాంతాల్లో పాములు, ముసళ్ళు కొట్టుకు రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.  తాజాగా ఓ మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. గుజరాత్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల కారణంగా జనజీవనం అస్త వ్యస్తమైంది. ఎక్కడ చూసినా వరదనీరే.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైప చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి నేల రాలాయి.. దీంతో పలు ప్రాంతాల్లో కరెంట్ నిలిపివేశారు. ఓ గ్రామంలో వరదల కారణంగా పశువులు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపించాయి. తాజాగా ఓ ఇంటి రేకుల కప్పుపై పెద్ద ముసలి కనిపించింది. భారీ వరదల్లో మొసళ్లు కొట్టుకువచ్చినట్లు తెలుస్తుంది. వర్షాల ధాటికి మనుషులే కాదు.. పశు పక్షాదులు కూడా నరకం అనుభవిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 18 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. గురువారం కూడా 11 జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.గుజరాత్ ప్రభుత్వం వివరాల ప్రకారం.. వడోదర, మోర్చి, జామ్ నగర్, బరూచ్, ఆరావల్లి, పంచమహల్, ద్వారకా, డాంగ్ లో ఒక్కొక్కరు, ఆనంద్ లో ఆరుగులు, అహ్మదాబాద్ లో నలుగురు, గాంధీ నగర్‌లో ఇద్దరు ఇద్దరు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. గుజరాత్ లోని పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం భూపేంద్ర పటెల్ కు ఫోన్ చేసి అంచనాలు వేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రానికి కేంద్రం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.