వీడియో: ట్రైన్ లో ప్రయాణిస్తున్నారా? దొంగలు ఇలా కూడా ఉంటారు జాగ్రత్త!

Railway Passengers be Careful: రైల్వే స్టేషన్లలో దొంగలు ఉంటారని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు సిబ్బంది. కానీ కొంతమంది నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు.

Railway Passengers be Careful: రైల్వే స్టేషన్లలో దొంగలు ఉంటారని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు సిబ్బంది. కానీ కొంతమంది నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు.

ఇటీవల డబ్బు సంపాదించడం కోసం కేటుగాళ్లు ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. చిల్లర దొంగతనాల నుంచి మొదలు అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ అమ్మకాల వరకు ఎన్నో రకాల దందాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాలు గడపాలనే ఆశతో ఇలాంటి నేరాలకు పాల్పపడితే.. చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బు అవసరమైన వాళ్లు మరికొందరు. ఏది ఏమైనా మనం చిన్న ఏమరపాటుతో ఉంటే సెకన్లలో దోచుకు వెళ్తుంటారు. బయటికి వచ్చినపుడు ప్రతి విషయంలో జగ్రత్తలు తీసుకోవాలి అంటారు. సాధారణంగా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లో దొంగలు ఉన్నారి హెచ్చరిక బోర్డులు పెడుతుంటారు. తాజాగా కదులుతున్న రైల్ నుంచి ఓ యువకుడు చోరీ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

సాధారణంగా రైల్వే స్టేషన్లలో చిల్లర దొంగలు ఎక్కువగా తిరుగుతుంటారు. చిన్న ఏమరపాటు ఉంటే చాలు ఇట్టే దోచేస్తారు. రైల్వే సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. చోరీలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ప్రయాణిస్తున్న రైలు నుంచి ఓ ప్యాసింజర్ కి చెందిన సెల్ ఫోన్ చోరీ చేసిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సీటు దొరికింది కదా.. హ్యాపీగా కూర్చొని సెల్ ఫోన్ పాటలు వింటున్నారా? వాట్సాప్ ఛాటింగ్ లో మునిగిపోయారా? ట్రైన్ ఎక్కగానే ఫోన్ చార్జింగ్ పెడుతున్నా? అయితే జర భద్రం.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి దొంగలు ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నారో తెలుస్తుంది.

స్టేషన్‌లో ట్రైన్ నెమ్మదిగా కదులుతుంది.. ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకొని కూర్చున్నాడు. అదే సమయానికి ఫ్లాట్ ఫామ్ పై ఓ దొంగ తన చేతివాటం చూపించాడు. రైలు స్టార్ట్ అయి కదులుతుంది.. కిటికీలో నుంచి చేయి పెట్టి ప్రయాణికుడి ఫోన్ దొంగిలించి అక్కడ పారిపోయాడు. ఆ ప్రయాణికుడు బయటకు రాలేకపోవడంతో లబో దిబో అన్నాడు. అప్పటికే రైలు వేగంగా కదిలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో _fear_of_life_ అనే ఖాతా ద్వారా షేర్ చేయబడి.. ఈ వీడియోని ఇప్పటి వరకు 73.7 మిలియన్లమంది చూశారు. 17 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియో చూసిన వారు రైల్వే ప్రయాణాలు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలి.. లేకుండా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments