గురుగ్రామ్‌లోని యాంబియన్స్ మాల్‌కు బాంబు బెదిరింపు! ఆ మెయిల్‌లో ఏముందంటే?

ఇటీవల దేశంలో పలు పర్యాటక కేంద్రాలు, రద్దీగా ఉండే ప్రయాణ ప్రాంగణాలు, మాల్స్, సెలబ్రెటీలు, విద్యా సంస్థలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హర్యానాలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం ఆందోళన కలిగించింది.

ఇటీవల దేశంలో పలు పర్యాటక కేంద్రాలు, రద్దీగా ఉండే ప్రయాణ ప్రాంగణాలు, మాల్స్, సెలబ్రెటీలు, విద్యా సంస్థలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హర్యానాలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం ఆందోళన కలిగించింది.

దేశంలో కొంతకాలంగా బాంబు బెదిరింపులు రావడం.. పోలీసులు కంగారు పడి అక్కడికి వెళ్లి అణువణువూ జల్లెడ పట్టి బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకోవడం సర్వసాధారణంగా మారింది. కొంతమంది ఆకతాయిలు, మతి స్థిమితం లేని వారు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, పాఠశాలలు, విమానాశ్రయాలు, బస్ స్టేషన్, ప్రముఖ షాపింగ్ మాల్స్, పార్కులు టార్గెట్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బెదిరింపు కాల్స్ రాగానే అలర్ట్  పోలీసులు, బాంబ్ స్క్వాడ్ లు స్పాట్ కి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించడం.. బాంబు జాడలు లేవని చెప్పడం చూస్తూనే ఉన్నాం. తాజాగా గురు గ్రామ్‌లో ఆంబియెన్స్ మాల్ కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఇక యూపిలోని నోయిడాలో డీఎల్ఎఫ్ మాల్ లో ప్రత్యేక భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్ మాల్‌కు శనివారం  ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  ‘ప్రతి ఒక్కరినీ చంపేందుకు మాల్ లో బాంబులు అమర్చాం.. మీరు ఎవరూ తప్పించుకోలేరు, అందరూ చనిపోతారు’ మెయిల్ సారాంశం అంటున్నారు అధికారులు.   అప్రమత్తమైన మాల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌ మాల్‌కు వెళ్లి క్షుణ్ణంగా శోధించారు.. అయితే అనుమానించాల్సిని ఏవీ లేనట్టుగా తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బాంబ్ బెదిరింపులకు ప్రజలు అలర్ట్ గా ఉండటానికి DLF మాల్  మాక్ డ్రిల్ నిర్వహించారు పోలీసులు.  ఈ సందర్బంగా నోయిడా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ మాల్ మాట్లాడుతూ.. ‘సెక్టార్ 18 లోని DLF మాల్ లో మాల్ మొత్తం ఖాళీ చేసి మాక్ డ్రిల్ నిర్వహించామని.. ఈ సందర్భంగా మాల్ ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని అన్నారు.తనిఖీ సమయంలో మాల్ లో జనాలను పూర్తిగా ఖాళీ చేయించామని అన్నారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినపుడు ఎవరికీ ఏ ప్రమాదం జరగకుండా తనిఖీలు చేయడం జరుగుతుందని, ఈ డ్రిల్ లో ఫైర్ సర్వీసెస్, డాగ్ స్క్వాడ్, పోలీస్ బృందాలు పాల్గొంటాయని’ అని అన్నారు.

Show comments