iDreamPost
android-app
ios-app

రూ.కోటి జీతాన్ని కాదని లక్ష పెట్టుబడితో రూ.50 కోట్ల కంపెనీకి ఓనర్ అయిన యువతి

  • Published Aug 28, 2024 | 3:25 PM Updated Updated Aug 28, 2024 | 3:25 PM

Woman Who Rejected 1 Crore Job Offer: కోటి రూపాయల జీతం ఇస్తామన్నారు.. కానీ ఆమె వద్దనుకుంది. ఒక చిన్న ఆలోచనకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక చిన్న కంపెనీని స్థాపించింది. అంతే మూడేళ్ళలో ఆ లక్షని 50 కోట్లు చేసింది.

Woman Who Rejected 1 Crore Job Offer: కోటి రూపాయల జీతం ఇస్తామన్నారు.. కానీ ఆమె వద్దనుకుంది. ఒక చిన్న ఆలోచనకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక చిన్న కంపెనీని స్థాపించింది. అంతే మూడేళ్ళలో ఆ లక్షని 50 కోట్లు చేసింది.

రూ.కోటి జీతాన్ని కాదని లక్ష పెట్టుబడితో రూ.50 కోట్ల కంపెనీకి ఓనర్ అయిన యువతి

రూ. కోటి జీతం ఇస్తామంటే ఎవరూ కూడా ఇలాంటి జాబ్ ఆఫర్ ని వదులుకోరు. కానీ ఒక యువతి మాత్రం కోటి రూపాయల జీతం ఇస్తామన్నా గానీ లెక్క చేయలేదు. రెండు సార్లు ఆఫర్ వచ్చినా సరే పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె గమ్యం, లక్ష్యం వేరే. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉద్యోగం పొందలేకపోతున్న వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేయాలన్నదే ఆమె ఆశయం. ఈ క్రమంలో ఆమె ఒక కంపెనీ స్టార్ట్ చేసి 10 లక్షల మందికి పైగా యువతీ యువకులకు ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసింది. ఇవాళ ఈమె దయ వల్ల విదేశాల్లో చాలా మంది మంచి ప్యాకేజీ తీసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. కేవలం లక్ష రూపాయలతో కంపెనీ పెట్టింది. మూడేళ్ళలో ఆ కంపెనీని రూ. 50 కోట్ల విలువైన కంపెనీగా తీర్చిదిద్దింది.  

ఆమె పేరు ఆరుషి అగర్వాల్. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాలో జన్మించింది. ప్రస్తుతం ఘజియాబాద్ జిల్లాలోని నెహ్రూ నగర్ లో నివాసం ఉంటుంది. బీటెక్, ఎంటెక్ చేసిన తర్వాత ఈమె ఐఐటీ ఢిల్లీలో ఇంటర్న్షిప్ చేసింది. రెండు సార్లు కోటి రూపాయల ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. కానీ ఆమె ఆ ఆఫర్స్ ని కాదని సొంతంగా కంపెనీ పెట్టాలనుకుంది. అలా లక్ష రూపాయలతో కంపెనీ ప్రారంభించింది. 24 ఏళ్ల వయసులోనే కంపెనీ పెట్టి మూడేళ్లలో 50 కోట్ల టర్నోవర్ కి తీసుకెళ్లింది. క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఎవరైతే సెలెక్ట్ అవ్వని వారు ఉంటారో వారికి సహాయం చేసేలా ఒక సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేసింది. అందుకోసం ఆమె కోడింగ్ నేర్చుకుంది. కోవిడ్ సమయంలో లక్ష రూపాయల పెట్టుబడితో ‘టాలెంట్ డీక్రిప్ట్’ అనే కంపెనీని స్టార్ట్ చేసింది.

కంపెనీ పెట్టిన మూడేళ్ళలో ఆమె సాఫ్ట్ వేర్ ద్వారా 10 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. వీళ్లలో చాలా మంది అమెరికా, జర్మనీ, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌతాఫ్రికా, శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. టాలెంట్ డీక్రిప్ట్ సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫార్మ్ లో నిరుద్యోగులు హ్యాకథాన్ ద్వారా ఇంట్లోనే ఉండి వర్చువల్ స్కిల్ టెస్ట్ లో పాల్గొనవచ్చు. ఒకవేళ ఈ టెస్ట్ లో పాసైతే నేరుగా ఇంటర్వ్యూకి హాజరై ఉద్యోగం పొందవచ్చు. ఇప్పటికే చాలా యూనివర్సిటీలు ఈమె డెవలప్ చేసిన సాఫ్ట్ వేర్ సేవలని వినియోగించుకుంటున్నాయి. దేశంలోనే టాప్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఆరుషి అగర్వాల్ ఉంది. భారత ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది. ఈమె తండ్రి అజయ్ గుప్తా ఒక వ్యాపారవేత్త మరియు ఈమె తల్లి గృహిణి. ఈమెకు తన తాతయ్య ఓం ప్రకాష్ గుప్తానే ఆదర్శం. ఆయనను ఆరాధ్య దైవంగా భావిస్తుంది. మరి కోటి రూపాయల జాబ్ ఆఫర్ ని కాదని లక్ష రూపాయల పెట్టుబడితో కంపెనీని స్థాపించి దాన్ని 50 కోట్ల కంపెనీగా తీర్చిదిద్దిన యువతికాన్ఫిడెన్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.