iDreamPost
android-app
ios-app

నోయిడాలో భారీ వర్షంతో తీవ్రంగా నష్టపోతున్న ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌! ఎలాగంటే..?

  • Published Aug 30, 2024 | 4:41 PM Updated Updated Aug 30, 2024 | 4:41 PM

Afghanistan, Noida, Heavy Rain, AFG vs NZ: మనదేశంలోని గ్రేటర్‌ నోయిడాలో కురిసిన భారీ వర్షం.. ఆఫ్ఘనిస్థాన్‌కు తీవ్ర నష్టం చేసింది. అది ఎలాగో తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్‌ పూర్తిగా చదవండి..

Afghanistan, Noida, Heavy Rain, AFG vs NZ: మనదేశంలోని గ్రేటర్‌ నోయిడాలో కురిసిన భారీ వర్షం.. ఆఫ్ఘనిస్థాన్‌కు తీవ్ర నష్టం చేసింది. అది ఎలాగో తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్‌ పూర్తిగా చదవండి..

  • Published Aug 30, 2024 | 4:41 PMUpdated Aug 30, 2024 | 4:41 PM
నోయిడాలో భారీ వర్షంతో తీవ్రంగా నష్టపోతున్న ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌! ఎలాగంటే..?

ఇండియాలో వర్షం వస్తే.. ఎక్కడో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌కి నష్టం ఏంటని ఆలోచిస్తున్నారా? నష్టం ఆఫ్ఘాన్‌ దేశం మొత్తానికి కాదులేండి.. ఆ దేశపు క్రికెట్‌ టీమ్‌కి. తాలిబాన్‌ దేశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో క్రికెట్‌ డెవలప్‌మెంట్‌కు ఇండియా ఎంతో సాయం చేసిందనే విషయం తెలిసిందే. మన దేశంలో వాళ్లకు క్యాంపులు ఏర్పాటు చేయడం, సరైన కోచింగ్‌ వసతులు కల్పించడం లాంటి సౌకర్యాలు ఇచ్చింది. ఇప్పటికీ ఆ హెల్ప్‌ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ మన దేశంలోనే ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఉంది ఆఫ్ఘాన్‌ టీమ్‌.

నోయిడాలోని షహీద్‌ విజయ్‌ సింగ్‌ స్టేడియంలో సెప్టెంబర్‌ 9 నుంచి న్యూజిలాండ్‌తో ఆఫ్ఘనిస్థాన్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది. గతంలో కూడా ఆఫ్ఘనిస్థాన్‌ ఇండియాలో వేరే దేశాలతో మ్యాచ్‌లు ఆడింది. ఒక విధంగా చెప్పాలంటే.. ఆఫ్ఘాన్‌ టీమ్‌కు గ్రేటర్‌ నోయిడా సెకండ్‌ హోం గ్రౌండ్‌ అని చెప్పాలి. దాదాపు 4 ఏళ్ల తర్వాత.. ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు ఆఫ్ఘాన్‌ టీమ్‌ వచ్చింది. అయితే.. న్యూజిలాండ్‌ లాంటి పటిష్ట టీమ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌కి ముందు మంచి ప్రాక్టీస్‌ కోసం 10 రోజుల ముందే నోయిడాకు వచ్చారు ఆఫ్గాన్‌ ఆటగాళ్లు.

శుక్రవారం(ఆగస్టు 30) ఉదయం నుంచి వాళ్లు ప్రాక్టీస్‌ ప్రారంభించాల్సి ఉంది. కానీ, గురువారం రాత్రి పడిన భారీ వర్షానికి గ్రౌండ్‌ మొత్తం చిత్తడిగా మారింది. దీంతో.. ఆఫ్ఘాన్‌ టీమ్‌కు ప్రాక్టీస్‌ లేకుండా హోటల్స్‌ రూమ్స్‌కే పరిమితం అయ్యారు. పైగా సెప్టెంబర్‌ 8 వరకు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. అలా అయితే.. ఎంతో కీలకమైన మ్యాచ్‌కి ముందు సరైన ప్రాక్టీస్‌ లేకపోతే.. న్యూజిలాండ్‌కు పోటీ కూడా ఇవ్వలేదు ఆఫ్ఘాన్‌. ఇదే విషయమై ఆఫ్ఘాన్‌ కెప్టెన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ఇక్కడ మేం స్విమ్‌ చేసుకోవచ్చు’ అంటూ సరదాగా పేర్కొన్నాడు. పిచ్‌ క్యూరేటర్‌ శర్మ, మరో 10 మందితో కలిసి.. పిచ్‌ను రెడీ చేసేందుకు శ్రమిస్తున్నారు. పెద్ద పెద్ద టేబుల్‌ ఫ్యాన్స్‌ పెట్టి.. పిచ్‌లో తడి ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఇలా నోయిడాలో కురిసిన భారీ వర్షం ఆఫ్ఘాన్‌ టీమ్‌ను ప్రాక్టీస్‌కి దూరం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.