Keerthi
ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతల్లో బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి దేశంలో ప్రభుత్వ, ప్రవైట్ ఆసుపత్రులతో పాటు ఓ మాల్ కు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ ఎక్కడంటే
ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతల్లో బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి దేశంలో ప్రభుత్వ, ప్రవైట్ ఆసుపత్రులతో పాటు ఓ మాల్ కు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ ఎక్కడంటే
Keerthi
తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ తదితర 50 ప్రభుత్వ ,ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు ఒక మాల్‌కు మంగళవారం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ బాంబు బెదిరింపు చర్యలు అనేవి నన్‌గ్లోయిలోని ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.04 గంటలకు , చాణక్యపురి లోని ప్రైమస్ ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.07 గంటల సమయంలో వచ్చయనే సమాచారం తమకు అందిందని ఢిల్లీ ఫైర్‌సర్వీస్ అధికారి చెప్పారు. ఇక మిగతా ఆస్పత్రుల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఇకపోతే బాంబు బెదిరింపు కాల్స్ అందుకున్న వాటిలో అపోలో, మూల్‌చంద్, మాక్స్ అండ్ సర్‌గంగారామ్ ఆస్పత్రులు కూడా ఉన్నాయని వారు వెల్లడించారు.
అయితే ఈ బాంబే బెదిరింపు చర్యలు అనేవి నేడు అనగా మంగళవారం (ఆగస్టు 20వ తేదీ) మధ్యాహ‍్నం 12.04 గంటలకు జిమెయిల్ రూపంలో వచ్చాయి. కాగా, అందులో.. గుర్తు తెలియని వ‍్యక్తులు మీ భవనం లోపల అనేక పేలుడు పదార్థాలను అమర్చాం. అవి నల్లటి కవర్లలో ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో అవి పేలబోతున్నాయి. మీ భవనంలో ఉన్నవారందరూ రక్తపు మడుగులో అంతం కానున్నారు. మీలో ఏ ఒక్కరూ మిగలరు. మానవాళికి స్కామ్ తప్ప నాకు మరేమీ లేదు. ఈరోజు భూమిపై మీ ఆఖరి రోజు అని హెచ్చరించి ఉంది. ఇకపోతే ఈ మెయిల్ లో సిఒయుఆర్‌టి పేరు గల గ్రూపుతో ఉంది. అంతేకాకుండా.. ఉగ్రవాదాన్ని తాము ఆపలేం. న్యూస్ అవుట్‌లెట్స్‌కు గ్రూప్ పేరు ఇవ్వండి అని ఉంది. అయితే ఈ బెదిరింపు ఈ మెయిళ్లు ఇదివరకు ఆస్పత్రులకు, స్కూళ్లకు, యూనివర్శిటీలకు, ప్రభుత్వ భవనాలకు పంపిన మాదిరి గానే ఉన్నాయని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.