భోలే బాబా అంటూ కొత్త దేవుడు.. ఎగబడ్డ జనం! తొక్కిసలాటలో 75 మృతి..!

Hathras Accident: ఓ బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి..23 మంది మరణించారు. అందులో 19 మహిళలు, ముగ్గురు చిన్నారు ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Hathras Accident: ఓ బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి..23 మంది మరణించారు. అందులో 19 మహిళలు, ముగ్గురు చిన్నారు ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఎంతో మంది భక్తులు నిత్యం దేవాయలయాలకు వెళ్తుంటారు. అక్కడ జరిగే ఆధ్యాత్మిక ప్రసంగాల్లో పాల్గొంటారు. అంతేకాక ప్రత్యేక పర్వదినాల సమయంలో ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. అలానే వివిధ రకాల గురువుల, బాబాల దగ్గరకు కూడా ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో అనుకోని ఘటన తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటాయి. ఆలయాల్లో తొక్కిసలాట జరిగిన ఘటనలు మనం అనేకం చూశాం. ముఖ్యంగా ఏవైనా జాతరు, కుంభమేళ వంటి పెద్ద కార్యక్రమాలు జరిగిన వివిధ కారణాలతో ఘోరాలు జరుగుతుంటాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. బోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి..75 మంది మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

దేశంలో అనేక రకాల బాబాలు, గురువులు ఉన్నారు. ఎంతోమంది భక్తులు వీరి వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అలానే కొందరు దొంగబాబాలు, దొంగ గురువులు కూడా పుట్టుకొస్తుంటారు. ఇలాంటి వారి వలన నిజమైన గురువులను, బాబాలను జనం నమ్మడానికి ఆలోచిస్తున్నారు. ఇది ఇలా ఉంటే బాబాల సత్సంగ్ గానీకి భక్తులు తరచూ వెళ్తుంటారు. అలానే ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ లో భోలే బాబా ప్రసిద్ది. ఇక్కడ జరిగే సత్సంగ్ కి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక బాబా దర్శనం కోసం చాలా ప్రాంతాల నుంచి ఇక్కడి భక్తులు వస్తుంటారు.

మంగళవారం కూడా భోలే బాబా సత్సంగ్ కార్యక్రమం జరిగింది. ఈ ప్రొగ్రామ్ లో భక్తులు ఒక్కసారిగాఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర విషాదంలో 75 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం.  ఈ ప్రమాదంలో వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అప్పుడప్పుడు.. ఇలాంటి ఘటనలు ఏదో ఒక ప్రాంతంలో చోటుచేసుకుంటూనే ఉంటాయి. మరి..ఇలాంటి ప్రమాదాల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments