పంచె కట్టున్నాడని రైతుకు నో ఎంట్రీ.. మాల్ మూసివేత

Bengaluru Mall: సమాజంలో కట్టుకునే బట్టలను బట్టి గౌరవం ఇస్తారని మరోసారి రుజువైంది. ఓ రైతు పంచెకట్టుతో మాల్ లోకి వెళ్లగా ఆయన్ని ఆపి అవమానించారు. ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

Bengaluru Mall: సమాజంలో కట్టుకునే బట్టలను బట్టి గౌరవం ఇస్తారని మరోసారి రుజువైంది. ఓ రైతు పంచెకట్టుతో మాల్ లోకి వెళ్లగా ఆయన్ని ఆపి అవమానించారు. ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

ఈ మధ్య కాలంలో మనిషి డబ్బు, దర్భాన్ని బట్టి సమాజంలో గౌరవం ఇస్తున్నారు. ఇటీవల కొన్ని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్ లో మనిషి వేషభాషలు చూసి అనుమతి ఇస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వారిని అగౌర పరుస్తున్నారు. ఆ మద్య ఓ మహిళ చీరకట్టుతో రెస్టారెంట్ కి వెళితే అక్కడ మహిళా, సెక్యూరిటీ లోపలికి అనుమతివ్వకుండా అవహేళన చేశారు. అలాంటి సంఘటన ఓ షాపింగ్ మాల్ లో చోటుసుకుంది. ఓ రైతు పంచె కట్టుతో మాల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ ఆయన్ని ఆపాడు. ఈ విషయాన్ని ఆయన కొడుకు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడంతో షాపింగ్ మాల్ యాజమాన్యానికి తగిన శాస్తి జరిగింది. వివరాల్లోకి వెళితే.

ధోతీ కట్టి మాల్ లోకి వచ్చిన రైతన్నను నిరాకరించిన బెంగుళూరు ఘటన యావత్ దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మాల్ లో తమ వద్ద సినిమా టికెట్ ఉన్నప్పటికీ తన తండ్రి ధోతీ కట్టి వచ్చాడని జీటీ మాల్ లోకి అనుమతించలేదని పెద్దాయన కొడుకు ఈ ఘటన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి మాల్ యాజమాన్యం రైతన్నకు క్షమాపణలు చెప్పింది. అయినా విషయం అక్కడితో ఆగలేదు.. అన్నదాతకు జరిగిన అవమానంపై రైతు సంఘాలు భగ్గుమన్నాయి.

ఈ విషయం గురించి యావత్ దేశం మొత్తం చర్చనీయాంశం కావడం.. రాజకీయంగా దుమారం రేగింది. చివరికి అధికారులు జోక్యం చేసుకొని మాల్ పై చర్యలకు ఉపక్రమించారు. అంతేకాదు రైతుకు ఎంట్రీ నిరాకరించిన మాల్ యజమాని, సెక్యూరిటీ గార్డుపై కేసు నమోదు అయ్యింది. పోలీసులు చర్యలు తీసుకోకుండా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని రైతు నాయకులు హెచ్చరించడంతో సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. తాత్కాలికంగా మాల్ ని మూసివేశారు. వారం రోజుల పాటు మాల్ ని మూసి వేయాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. రైతన్న జోలికి వస్తే ఇలాగే తగిన శాస్తి జరుగుతుందని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments