Nidhan
అయోధ్యలో బాలరాముడు కొలువుదీరడంతో భక్తులు సంబురాల్లో మునిగిపోయారు. వందల ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తరుణంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో అయోధ్య విషయంలో చేసిన ఓ పని అంటూ ఓ వార్త వైరల్ అవడం చర్చనీయాంశంగా మారింది.
అయోధ్యలో బాలరాముడు కొలువుదీరడంతో భక్తులు సంబురాల్లో మునిగిపోయారు. వందల ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తరుణంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో అయోధ్య విషయంలో చేసిన ఓ పని అంటూ ఓ వార్త వైరల్ అవడం చర్చనీయాంశంగా మారింది.
Nidhan
శతాబ్దాల కల సాకారం అయింది. రామ భక్తుల 500 ఏళ్ల స్వప్నం నెరవేరింది. ఎన్నో వేల మంది త్యాగాలకు ఫలితంగా రామ మందిరం నిర్మాణం పూర్తయి ప్రారంభమైంది. అయోధ్యలో నూతనంగా నిర్మించిన భవ్య మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూసి భక్తకోటి పులకించిపోయారు. రామయ్యను చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏళ్ల కల నెరవేరడంతో పట్టరాని ఆనందంలో ఏడ్చేశారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు జాతి మొత్తం ఏకమై రామనామాన్ని జపించింది. రామాలయం ప్రారంభం కావడం, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. అలాంటి ఈ సమయంలో అయోధ్య రామాలయం విషయంలో అప్పటి ప్రధాని, దివంగత జవహర్లాల్ నెహ్రూ రాసిన కొన్ని లేఖలు అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.
అది 1949వ సంవత్సరం, డిసెంబర్ 22వ తేదీ. అప్పటికే సుమారు 450 ఏళ్ల నుంచి అయోధ్యలో రామమందిరం విషయంలో గొడవ జరుగుతోంది. బాబ్రీ మసీదు స్థలంలో రామాలయం ఉండేదని.. ఆ స్థలంలో మళ్లీ ఆలయం నిర్మించాలని ఎంతో మంది పోరాడుతూ వచ్చారు. ఈ క్రమంలో 1949, డిసెంబర్ 22న బాబ్రీ మసీదు లోపల హఠాత్తుగా రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. అయితే ఇది హిందూ మహాసభ కార్యకర్తలు చేసిన పనేనంటూ ముస్లింలు కోర్టుకెక్కారు. రాముడు స్వయంభూగా అక్కడ వెలిశాడని హిందువులు కౌంటర్ సూట్ దాఖలు చేశారు. దీంతో అదే నెల 26వ తేదీన అప్పటి ప్రధాని నెహ్రూ అయోధ్యను సందర్శించి పరిస్థితులను సమీక్షించాలని భావించారట. అప్పుడు న్యూఢిల్లీలో ఉన్న ఆయనకు అయోధ్యలోని సిచ్యువేషన్పై సమీక్షలు కూడా అందాయట. దీంతో ఆ రాష్ట్రంలోని పలువురు ప్రముఖులుకు ఆయన మూడు లెటర్లు రాశారట.
అయోధ్యలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ తొలుత లక్నోలోని యునైటెడ్ ప్రావిన్స్ సీఎం గోవింద్ వల్లభ్ పంత్కు టెలిగ్రామ్ పంపించారట నెహ్రూ. అందులో అయోధ్యలో జరుగుతున్న పరిణామాల మీద తాను కలత చెందానని.. ఈ విషయంలో మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారని ఆ లెటర్లో ఉంది. అయితే అందులో తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నారు మాజీ ప్రధాని. మసీదులో ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారని ఆ లెటర్లో ఉంది. ఆ తర్వాత 1950, జనవరి 7వ తేదీన గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారికి నెహ్రూ మరో లెటర్ రాశారని సమాచారం. అందులో తాను అయోధ్య గురించి పంత్ జీకి ఓ లేఖ రాశానని.. ఆ తర్వాత ఆయనతో మాట్లాడానని ఉంది. అలాగే అయోధ్య విషయంలో పంత్ చాలా ఆందోళన చెందుతున్నారని.. దీన్ని ఆయన పర్సనల్ తీసుకున్నట్లు చెప్పారని ఉంది.
ఈ రెండు లేఖలతో పాటు అయోధ్య విషయంలో ఫిబ్రవరి 5, 1950లో నెహ్రూ మరో లెటర్ కూడా రాశారని సమాచారం. అందులో కూడా అప్పటి సీఎం పంత్జీని ఉద్దేశించి.. అయోధ్య పరిస్థితులు తెలియజేస్తే సంతోషిస్తాను.. తాను బిజీగా ఉన్నానని.. అయినా అయోధ్యకు రమ్మంటే వచ్చేందుకు ఒక తేదీని ఫిక్స్ చేసుకుంటానని నెహ్రూ చెప్పారని ఉంది. అయితే సిచ్యువేషన్ ఏమాత్రం మారలేదని పంత్ చెప్పడంతో నెహ్రూ అయోధ్య విజిట్ కార్యరూపం దాల్చలేదట. ఈ లెటర్స్లో ఉన్నది ఎంత నిజయో తెలియదు. కానీ ఇవి మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి.. శతాబ్దాల కల నెరవేరడంతో రామ భక్తులు అందరూ సంతోషంగా ఉన్న ఈ టైమ్లో మాజీ ప్రధాని నెహ్రూ అయోధ్య విషయంలో లేఖలు రాశారని.. సీతారాముల విగ్రహాలను తీసేయాలని చెప్పారంటూ న్యూస్ వైరల్ కావడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.