iDreamPost
android-app
ios-app

Ayodhya: రామ మందిరంతో మారిపోనున్న ఉత్తర్​ప్రదేశ్ తలరాత.. నార్వేను మించిపోయేలా..!

  • Published Jan 22, 2024 | 2:33 PM Updated Updated Jan 22, 2024 | 2:33 PM

అయోధ్యలోని భవ్య రామ మందిరం ఇవాళ ప్రారంభమైంది. అయితే ఈ ఆలయం వల్ల ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్ర తలరాత మారిపోనుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

అయోధ్యలోని భవ్య రామ మందిరం ఇవాళ ప్రారంభమైంది. అయితే ఈ ఆలయం వల్ల ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్ర తలరాత మారిపోనుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 22, 2024 | 2:33 PMUpdated Jan 22, 2024 | 2:33 PM
Ayodhya: రామ మందిరంతో మారిపోనున్న ఉత్తర్​ప్రదేశ్ తలరాత.. నార్వేను మించిపోయేలా..!

అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. 500 ఏళ్ల కల కోట్లాది మంది రాముడి భక్తుల కోరిక నెరవేరింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. వేద పండితుల మంత్రోచ్ఛారణాల ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తి చేసుకుంది. కోట్లాది మంది భక్తుల చూస్తుండగా అభిజిల్లగ్నంలో ప్రధాని మోడీ ఆలయంలో బాల రాముడి ప్రతిష్టాపన చేశారు. ఈ సమయంలో దేవాలయం మీద హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు మంగళ వాయిద్యాలు మోగించారు. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, చిరంజీవి లాంటి సినీ ప్రముఖులతో పాటు వేలాది మంది ప్రజలు, స్వామీజీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అయోధ్య ఆలయంతో ఉత్తర్​ప్రదేశ్​ తలరాత మారిపోనుంది. ఏకంగా నార్వే దేశాన్ని అధిగమించనుంచి యూపీ.

అయోధ్యలోని బాల రాముడ్ని దర్శించుకునేందుకు రేపటి నుంచి సామాన్య భక్తులకు సదుపాయాలు కల్పించనున్నారని తెలిసింది. దీంతో ఉత్తర్​ప్రదేశ్ ఆర్థికంగా రూ.వేల కోట్లు ఆర్జిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) నివేదికలు అంచనా వేస్తున్నాయి. రామ మందిర ప్రారంభోత్సవంతో మన దేశంలో సందర్శించదగిన పర్యాటక ప్రదేశాల్లో అయోధ్య ఒకటిగా నిలవనుంది. గతంలో కంటే ఇప్పుడు వందల రెట్ల పర్యాటకులు అక్కడికి పోటెత్తడం ఖాయం. కాబట్టి ఉత్తర్​ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ఇది భారీగా పెంచుతుందని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. 2024-25లో యూపీ ఎకానమీ రూ.20,000 నుంచి రూ.25,000 కోట్లు పెరుగుతుందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఆ రాష్ట్ర పర్యాటక రంగ ఆదాయం రెట్టింపు అవుతుందని.. ఇప్పటికే అయోధ్యలో హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయని అంటున్నారు.

Uttar Pradesh Talarata to be changed..

2022లో ఉత్తర్​ప్రదేశ్​ను 32 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. ఇందులో 2.21 కోట్ల మంది జనాభా అయోధ్యకు వచ్చారు. ఆ ఏడాది పర్యాటకుల ద్వారా యూపీకి వచ్చిన ఆదాయం రూ.2 లక్షల కోట్లు అని సమాచారం. టూరిస్టులను అట్రాక్ట్ చేయడంలో ముందంజలో ఉన్న ఆ రాష్ట్రం.. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణంతో మరింత ఆదాయం పొందనుంది. 2027 నాటికి యూపీ ఎకానమీ 500 బిలియన్ డాలర్లు దాటుతుందని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. మన దేశ జీడీపీలో ఇది 10 శాతం అని అంటున్నారు. 2027-28 నాటికి జీడీపీ వెయిటేజీలో యూపీ రెండో స్థానాన్ని పొందుతుందని అంచనా వేస్తున్నారు. నార్వే దేశ జీడీపీని అప్పటికి యూపీ ఈజీగా అధిగమిస్తుందని చెబుతున్నారు. మరి.. నార్వేను ఉత్తర్​ప్రదేశ్​ దాటుతుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.