చెట్టుకు కట్టేసి అంగన్‌వాడీ కార్యకర్తపై మహిళల దాడి..ఎందుకో తెలుసా?

Anganwadi Worker: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం, మనస్థాపానికి, అసహనానికి గురి కావడం జరుగుతుంది. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు తెగబడుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

Anganwadi Worker: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం, మనస్థాపానికి, అసహనానికి గురి కావడం జరుగుతుంది. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు తెగబడుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

ఇటీవల దేశ వ్యాప్తంగా అంగన్ వాడీ స్కూల్స్ లో సిబ్బందిపై పలు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు పిల్లలకు వచ్చే ఐటమ్స్ విషయంలో చేతి వాటం చూపిస్తున్నారని.. పౌష్టిక ఆహారం అందించకుండా డబ్బులు సంపాదించే పనిలో ఉంటున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు ఈ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నప్పటికీ కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో కొంతమంది గ్రామస్థులు తరుచూ అంగన్ వాడి కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి ఘటనే ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది మహిళలు అంగన్ వాడి కార్యకర్తను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. సదరు మహిళా ఉద్యోగిని అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు సక్రమంగా ఆహారం అందించకుండా పక్క దారి పట్టిస్తుందని.. ముఖ్యంగా పిల్లలకు ఇచ్చే కోడి గుడ్లు అందించడం లేదని గ్రామానికి చెందిన మహిళలు ఆరోపిస్తూ ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 19న ఈ సంఘటన జరిగిన్నట్లు పోలీలు చెబుతున్నారు. బాధితురాలి పేరు ఊర్మిళ సవాల్.. సిలాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంగన్ వాడి కేంద్రంలో పని చేస్తుంది. గత కొంత కాలంగా ఆమెపై గ్రామస్థులు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఆమెను ఎన్ని సార్లు హెచ్చరించిన ఇలాగే చేస్తుందని ఓ మహిళ ఆరోపించింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బలియాపాల్ చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పర్బతి ముర్ము ఇతర అంగన్ వాడీ కార్యకర్తలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్థులను శాంతింపజేశారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె పరిస్థితి విషమించడంతో బాలాసోర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ తెలుసుకున్న పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

Show comments