iDreamPost
android-app
ios-app

ప్రయాణికుడిపై బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ దాడి! కారణం ఏమిటంటే?

  • Published Apr 01, 2024 | 4:55 PM Updated Updated Apr 01, 2024 | 4:55 PM

ఈ మధ్య ఉచిత బస్సుల సదుపాయంతో బస్సులో ప్రయాణికుల మధ్య జరిగుతున్న వివాదాలు గురించి అందరికి తెలిసిందే. తరుచు ఎక్కడబడితే అక్కడ ప్రయాణికుల మధ్య వివాాదాలు, కండెక్టర్ పై దాడులు చేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. అయితే తాజాగా ఓ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నం ఓ దారణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు పై బస్సు డ్రైవర్ , కండెక్టర్ ప్రవర్తించిన తీరు తీవ్ర సంచలనంగా మారింది.

ఈ మధ్య ఉచిత బస్సుల సదుపాయంతో బస్సులో ప్రయాణికుల మధ్య జరిగుతున్న వివాదాలు గురించి అందరికి తెలిసిందే. తరుచు ఎక్కడబడితే అక్కడ ప్రయాణికుల మధ్య వివాాదాలు, కండెక్టర్ పై దాడులు చేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. అయితే తాజాగా ఓ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నం ఓ దారణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు పై బస్సు డ్రైవర్ , కండెక్టర్ ప్రవర్తించిన తీరు తీవ్ర సంచలనంగా మారింది.

  • Published Apr 01, 2024 | 4:55 PMUpdated Apr 01, 2024 | 4:55 PM
ప్రయాణికుడిపై బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ దాడి! కారణం ఏమిటంటే?

రాష్ట్రంలో ఉచిత బస్సు సదుపాయం అమలు చేసిన నుంచి.. బస్సులో ప్రయాణికుల మధ్య జరిగే అల్లర్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరుచు ఏదో ఒక చోట మహిళ ప్రయాణికులు సీట్ల కోసం వాగ్వాదానికి దిగడం, కొట్టుకోవడం వంటి వివాదాలు కామన్ అయిపోయాయి. అంతేకాకుండా.. బస్సులోని కండక్టర్ తో వివాదం పెట్టుకోవడం, వారి పై దాడి దిగడం వంటి సంఘటనలు కూడా ఈ మధ్య తరుచు చూస్తూ, వింటున్నాం. అయితే తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం అందుకు కాస్త భిన్నంగా జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి పై బస్సు డ్రైవర్ , కండెక్టర్ ప్రవర్తించిన తీరు తీవ్ర సంచలనంగా మారింది. ఇక వీరు చేసిన నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

ఉత్తర ప్రదేశ్ లోని ఓ దారుణం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి పై ఆ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో ఆ ప్రయాణికుడి చెవి, చేతి వేలు కొరికేశారు. ఇక వారి బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధిత ప్రయాణికుడు పోలీసులను ఆశ్రయించాడు.అయితే బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్దీప్‌ కుమార్‌ అనే వ్యక్తి గురువారం కైసర్‌ బాగ్‌ బస్‌ స్టేషన్‌ నుంచి బిస్వాన్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును సీతాపూర్‌ వద్ద ఎక్కాడు. కాగా, ఆ బస్సులో ఖాళీగా ఉన్న ఓ సీటులో అతడు కూర్చున్నాడు. అయితే ఖాళీ సీటులో కూర్చుని ఉన్న బాధితుడు కుల్దీప్ ని బస్సు కండక్టర్ వచ్చి వేరే సీటులో కూర్చోమని చెప్పాడు. కానీ, ఎందుకని అతడి అడగగా.. బస్సు దిగిపొమని బెదిరించాడు. ఇక ఈ క్రమంలోనే డ్రైవర్‌తోపాటు బస్సులో ఉన్న మరికొందరు కుల్దీప్‌ కుమార్‌పై దాడికి దిగారు. అలాగే తన చేతి చిటికెన వేలు, చెవిని కొరికేశారని తెలిపాడు. అంతేకాకుండా.. తనవద్ద ఉన్న బంగారు గొలుసు, రూ.19,600ల నగదును కూడా దోచేశారని బాధితుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఇక ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నట్లు వాఝీర్‌గంజ్ పోలీస్ అధికారి దినేష్ మిశ్రా వెల్లడించారు. అలాగే యూపీఎస్ఆర్‌టీసీ కూడా ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుల‌యిన ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. మరి, బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి పై బస్సు సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులు అంత కర్కాశంగా ప్రవర్తించిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.