Uppula Naresh
ఇంట్లోకి పాము దూరితేనే అంతా హడావిడి చేస్తాం. అలాంటిది ఏకంగా చిరుత ఇంట్లోకి దూరితే ఎలా ఉంటుంది. కానీ, ఓ చోట అదే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇంట్లోకి పాము దూరితేనే అంతా హడావిడి చేస్తాం. అలాంటిది ఏకంగా చిరుత ఇంట్లోకి దూరితే ఎలా ఉంటుంది. కానీ, ఓ చోట అదే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Uppula Naresh
మాములుగా మనకు తెలియకుండా ఇంట్లోకి పాము దూరితేనే అంతా హడావిడి చేస్తాం. అలాంటిది ఏకంగా చిరుత ఇంట్లోకి దూరిందంటే ఇంకేముంటుంది.. అందరికీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. కానీ, ఓ చోట మాత్రం అదే జరిగింది. కొందరు కుటుంబ సభ్యులు ఇంట్లో సరదాగా ఉన్న క్రమంలోనే సడెన్ గా ఓ చిరుత దారితప్పి ఏకంగా వారి ఇంట్లోకి దూరిపోయింది. దాన్నిచూసి ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యాకు. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామంతో గ్రామస్తులు అంతా భయంతో వణికిపోయారు. కొందరు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఇక హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ అధికారులు..ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించి చివరికి విఫలమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకు ఆ చిరుత ఇంట్లోకి ఎలా దూరింది? ఆ తర్వాత ఎవరిపైనైన దాడికి పాల్పడిందా? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనుకూరులో ఓ చిరుత ఉన్నట్టుండి గ్రామంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అది ఓ కుక్కను గమనిస్తూ దాని వెనకాలే పరుగెత్తింది. ఈ క్రమంలోనే దారితప్పి ఆ చిరుత ఏకంగా ఓ ఇంట్లోకి దూరిపోయింది. దాన్ని చూసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. ఆ సమయంలో వారికి ఏం చేయాలో అర్థం కాక బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తులను గమనించిన ఆ చిరుత ఇంట్లో ఉన్న కొందరిపై దాడి చేసింది. ఆ తర్వాత ఎలాగో వారు ఇంట్లో నుంచి బయట పడ్డారు.
దీన్ని గమనించిన కొందరు గ్రామస్తులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఆ అధికారులు చిరుతను పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అక్కడున్న ఓ జర్నలిస్ట్ పై కూడా చిరుత దాడి చేసింది. ఇక అతి కష్టంగా ఫారెస్ట్ అధికారులు ఆ చిరుతను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా.. అలసిపోయి మళ్లీ విఫలమైనట్లు సమాచారం. ఇంట్లో చిరుత అటు ఇటు తిరుగుతండగా కొందరు గ్రామస్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దారితప్పి ఏకంగా ఇంట్లోకి దూరిన చిరుత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Tamil Nadu: A leopard near Coonoor in Niligiri attacked several people including fire and safety department personnel. Operation is underway to trap the leopard. pic.twitter.com/tzF7fXfqE7
— ANI (@ANI) November 12, 2023