ఫుడ్ ఛాలెంజ్ కాదు.. ఎమోషనల్ స్టోరీ! కొడుకు ఆరోగ్యం కోసం 4 బిర్యానీలు తిన్న తండ్రి!

A Father Eat 4 biryanis For His Son Tamil Nadu: తన పిల్లలకు కష్టం వచ్చింటే చాలు ఆ కష్టాన్ని తీర్చేందుకు తండ్రి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతాడు. ఎంత కష్టమైనా భరించడానికి రెడీగా ఉంటాడు. అలానే ఓ తండ్రి..తన కుమారుడి ఆరోగ్యం కోసం చేసిన సాహసం అందరికి కన్నీళ్లు తెప్పిస్తుంది.

A Father Eat 4 biryanis For His Son Tamil Nadu: తన పిల్లలకు కష్టం వచ్చింటే చాలు ఆ కష్టాన్ని తీర్చేందుకు తండ్రి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతాడు. ఎంత కష్టమైనా భరించడానికి రెడీగా ఉంటాడు. అలానే ఓ తండ్రి..తన కుమారుడి ఆరోగ్యం కోసం చేసిన సాహసం అందరికి కన్నీళ్లు తెప్పిస్తుంది.

సాధారణంగా బిడ్డలపై  తల్లికి ఉండే ప్రేమ మాత్రమే ప్రపంచానికి తెలుస్తోంది.  అందుకే చాలా మంది తల్లిని మించిన యోధురాలులేదు అంటారు. అయితే ఇలా పిల్లలపై తాను చూపించే ప్రేమలో మాత్రం ఎందుకో తండ్రి వెనుకబడి ఉంటాడు. అందుకేనేమో ఆయన పిల్లల కోసం ఎంత కష్టపడిన..తల్లిని మించిన యోధుడు కాలేకపోతున్నాడు. అమ్మలా నాన్నబిడ్డలపై ప్రేమను పైకి చూపించనప్పటికీ వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసేందుకు పరితపిస్తాడు. కష్టాన్ని కాంపౌండ్ వాళ్లు దాటి ఇంట్లోకి రాకుండా బిడ్డలకు నీడ నిలుస్తాడు. వారి ఏ చిన్న కష్టం వచ్చిన తాను ఉన్నానంటూ భరోసాను కలిపిస్తుంటాడు నాన్న.  ఇక తన బిడ్డల ప్రాణాల మీదకు సమస్య వస్తే.. తన ప్రాణాలను సైతం అడ్డు వేసి..వారిని కాపాడుతాడు. తాజాగా కుమారుడి ఆరోగ్యం కోసం ఓ తండ్రి చేసిన పని కన్నీళ్లు తెప్పిస్తుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తమిళనాడులోని కోయంబత్తూరులో బోచే పుడ్ ఎక్స్ ప్రెస్ అనే ఓ రెస్టారెంట్ రకరకలా పోటీలు నిర్వహిస్తుంటుంది. అలానే ఇటీవలే ఈ రెస్టారెంట్ బిర్యాని ఈటింగ్ ఛాలెంజ్ ను కూడా నిర్వహించింది.  అరగంటలో ఆరు చికెన్ బిర్యానీలు తిన్న వారిని విజేతలుగా ప్రకటిస్తారు. అలా ఈ ఛాలెంజ్ లో విజేతలుగా నిలిచిన వారికి లక్ష రూపాయాలు బహుమతిగా ఇస్తారు. ఇదే సమయంలో నాలుగు బిర్యానీలు తింటే 50 వేలు వస్తాయి. మూడు బిర్యానీలు తిన్నవారికి 25 వేల రూపాయలు ఇస్తారు.

అదే ప్రాంతానికి చెందిన గణేష్ మూర్తి అనే వ్యక్తి కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. ఈ ఛాలెంజ్ లో గెలిస్తే తన కుమారుడు చికిత్స ఖర్చుల కోసం ఆ డబ్బులు పనికి వస్తాయని భావించాడు తండ్రి. దీంతో ఒకవైపు కొడుకు  ఆరోగ్యం బాగాలేదు అన్న దుఃఖాన్ని దిగమింగుకొని ఈటింగ్ బిర్యానీ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. ఒకవైపు తన బిడ్డ ఆరోగ్య సమస్య గురింతి తెలుసుకుని కన్నీటి పర్యంతమవుతూనే గణేష్ మూర్తి బిర్యాని తిన్నాడు. అలా మొత్తంగా కడుపులో బిర్యానీ పట్టకపోయినా ఒకవైపు పొట్టలో నుంచి నొప్పి వస్తున్న కూడా కొడుకు ఆరోగ్యమే గుర్తుకు వస్తుంది. అందుకే తన కడుపులో నొప్పి వస్తున్న కోసం బిర్యానీలు తిన్నాడు.

మొత్తంగా నాలుగు బిర్యానిలు తిన్న గణేష్ మూర్తి రూ. 50 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. తన బిడ్డ ఆరోగ్యం చికిత్స కోసం, చదువుల కోసం ఇలా తన ప్రాణం మీదకు తెచ్చుకుని మరీ ఈ బిర్యానీ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. కొడుకు కోసం గణేష్ మూర్తి చేసిన ఈ సాహసం తెలిసి.. అందరు కన్నీరు పెట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఇది ఫుడ్ చాలేంజ్ కాదు.. ఓ తండ్రి ఎమోషనల్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇలా తండ్రి బిడ్డల కోసం ఎంత కష్టపడిన వారి నుంచి ప్రేమను పొందడంలో మాత్రం ఎందుకో కాస్తా వెనుకబడే ఉంటాడు. మరి.. తన కొడుకు కోసం ఈ తండ్రి చేసిన సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments