iDreamPost
android-app
ios-app

షాకింగ్ ఘటన: 7 నెలల బాలుడి కడుపులో 2 కిలోల పిండం!

షాకింగ్ ఘటన: 7 నెలల బాలుడి కడుపులో 2 కిలోల పిండం!

ఉత్తర్ ప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ 7 నెలల బాలుడి కడుపులో పిండం ఏర్పడింది. ఆ విషమం తెలియని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టు కాళ్లు అరిగేలా తిరిగారు. ఇక రోజు రోజుకి ఆ బాలుడి కడుపు ఉబ్బి పోవడంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భయందోళనలకు గురయ్యారు. చేసేదేం లేక ఇటీవల ఓ మంచి డాక్టర్ ను సంప్రదించారు. దీంతో ఆ వైద్యుడు బాలుడిని పరిశీలించి అతపి కడుపులో పిండం ఏర్పడిందని గుర్తించారు. ఆ తర్వాత శస్త్ర చికిత్సతో వైద్యులు విజయవంతం ఆ పిండాన్ని తొలగించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో పరిధిలోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడు నెలల కిందట ఓ మగబిడ్డ జన్మించాడు. కొడుకు పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవదుల్లేవు. ఇక ఆ చిన్నారిని ప్రేమగా చూసుకుంటూ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఆ బాలుడు కడుపు రోజు రోజుకు ఉబ్బిపోతూ కనిపించింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గమనించి దగ్గర్లోని ఓ వైద్యునికి చూపించారు. అలా కొన్ని రోజులు గడిచింది. కాగా, రోజు రోజుకు ఆ బాలుడి కడుపు ఉబ్బిపోతుంది తప్పా.. తగ్గడం లేదు. ఇక ఆ బాలుడి తల్లిదండ్రులు భయపడిపోయారు. వెంటనే ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న ఓ వైద్యుడిని స్పందించారు.

పరీక్షించిన వైద్యులు బాలుడి కడుపులో పిండం ఏర్పడిందని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. ఖంగారుపడాల్సిన పని లేదని వైద్యులు ఆ దంపతులకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ఆ బాలుడి కడుపులో ఉన్న 2 కిలోల పిండాన్ని విజయవంతంగా బయటకు తీశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. కడుపులో పిండం అభివృద్ధి చెందిందని, గర్భాశయంలో ఓ పిండం వృద్ధి చెందకుండా మరో పిండంలో అలాగే ఉండి చనిపోయిందన్నారు. దీనినే వైద్య భాషలో ఫీటస్ ఇన్ ఫీటు సమస్య అంటారని డాక్టర్లు తెలిపారు. పిండాన్ని తొలగించడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: తండ్రి తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి